పబ్లిక్ గార్డెన్ లో పనులను వచ్చే ఆగస్టు పదిహేను నాటికి పూర్తి చేయాలని, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు.

మంగళవారం నాడు కలక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పబ్లిక్ గార్డెన్ ను అధికారులతో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం ట్రాఫిక్‌, కాంక్రీట్‌ జంగిల్‌గా మారిన బిజీ లైఫ్‌ లో ఉదయమో, సాయంత్రం పూటో వాకింగ్‌ కు వెళ్లినా, కుటుంబం లేదా స్నేహితులతో సరదాకా కాసేపు గడపాలన్నా, ప్రజలు పబ్లిక్ పార్కులకే వస్తారని అన్నారు. పార్కు లోఎక్కడా ఖాళీ ప్రదేశం ఉండకుండా ప్రతి అంగుళం సద్వినియోగ పరిచే విధంగా పార్కును తీర్చి దిద్దాలనీ అన్నారు.

పబ్లిక్ గార్డెన్ లో పనులను వచ్చే ఆగస్టు పదిహేను నాటికి పూర్తి చేయాలని, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు.- news10.app

పెద్దలకు వాకింగ్‌ ట్రాక్‌, యోగా ప్లేస్‌ లతో పాటు, పిల్లలకు మంచి ప్లే గ్రౌండ్‌ ను వీటిల్లో డెవలప్‌ చేయాలనీ అన్నారు. పబ్లిక్ గార్డెన్ గేట్ సరిగా పనిచేయడం లేదని స్థానికులు చెప్పగా.. వెంటనే మరమ్మతులు చేపట్టలని సూచించారు. పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అన్నారు. అహ్లాదకరమైన మొక్కలను నాటాలని తెలిపారు. నిరుపయొగమైన నిర్మాణాలు తొలగించాలని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో రోజు రోజుకూ పెరుగుతున్నట్రాఫిక్‌ రద్దీ, కాలుష్యాన్నిప్రజలుతట్టుకునేందుకు అహ్లాదకరమైనవాతావరణాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అనంతరం కలక్టర్ 57 డివిజన్ లో గల వైకుంఠ ధామం పనులను పరిశీలించారు. పనులు సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. అవసమైతే అదనపు నిధులు కేటాయిస్తామని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పోరేషన్ ఎస్. ఈ సత్యనారాయణ, ఛీఫ్ హర్టీకల్చర్ ఆఫీసర్ సునీత, అధికారులు శ్రీనివాస్, సంతోష్ బాబు, ఆనంద్,రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.