ప్రజాపంపిణీ బియ్యాన్ని పక్కదారి పట్టించి క్వింటాళ్ల కొద్దీ సేకరించి రీసైక్లింగ్ కోసం మిల్లులకు తరలించడం అతగాడిగి బియ్యం తో పెట్టిన విద్యగా మారిందట… నగర శివారు లోని మండలాల్లో ఉన్న మిల్లులకు రేషన్ బియ్యం తరలించడం ఇతనికి నిత్యకృత్యంగా మారిందట. ఇంత జరుగుతున్నా వరంగల్ నగరంలో ప్రజా పంపిణి బియ్యం అక్రమార్కుల చేతుల్లో పెట్టి చోద్యం చూస్తున్నారు సంబంధిత అధికారులు… టాస్క్ ఫోర్స్ సిబ్బంది ప్రజా పంపిణి బియ్యం అక్రమ రవాణా అరికట్టటంలో చొరవ చూపుతున్నప్పటికి, సంబంధిత అధికారులు మాత్రం తప్పు దారి పట్టిస్తున్నారు.
ఇది దందా…?
పర్వతగిరి సంగం మండలం లో ఏనుగల్లు గవిచర్ల,తీగరాజు పల్లి, మిగతా గ్రామల్లో ఉన్న మిల్లుల యాజమాన్యం అక్రమ వ్యాపారం బహటంగా నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. అయినప్పటికీ సివిల్ సప్లై అధికారులు అటు వైపు కన్నెత్తయిన చూడక పోవటం పలు అనుమానాలకు తావిస్తోంది… గతంలో టాస్క్ ఫోర్స్ అధికారులు బియ్యం అక్రమ రవాణా దారులను అరికట్టినప్పటికి సంబంధిత పోలీసులు కేసు నమోదు చేయకపోవటం పై సర్వత్రా విమర్శలు వెలువడుతున్నాయి. గత రెండు రోజులుగా న్యూస్ 10 పత్రిక వార్తలు ప్రచురించటం గమనించిన వ్యాపారులు ఉదయం పూట కాకుండా అర్ద రాత్రి ఈ బియ్యం అక్రమ దందా నడుపుతున్నట్టు తెలిసింది… ఐతే గతం లో లాగా ఆటోల్లో కాకుండా కొత్తగా ద్విచక్ర వాహనాల పై బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతే కాదు ఇక్కడి మిల్లు యాజమాన్యాలు టెక్నాలజీ ని సైతం బాగానే ఉపయోగించుకున్నట్లు తెలుస్తుంది.
ఇలా కొత్తరకంగా ఆలోచిస్తు మిల్లు చుట్టూ పక్కన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చి ఎవరైనా అధికారులు వస్తే బయటనుండి బయటనే మాట్లాడి పంపిస్తున్నట్లు సమాచారం. బాహటంగా నడిపే ఈ దందా పై గతం లో ఉన్న జాయింట్ కలెక్టర్ ప్రస్తుత కలెక్టర్ వీరి అక్రమాల పై ఒక మిల్లర్ పై కేసు నమోదు చేయటంతో ఆ కలెక్టర్ పైనే కేసు పెట్టిన ఘనత సంబంధిత మిల్లర్ల ది అని తెలిసింది. అందుకే అటు వైపు సంబంధిత అధికారులు కన్నెత్తయిన చూడరని బహటంగానే వ్యాపారాలు చర్చిచుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం రేషన్ బియ్యం అక్రమ దందా నడుపుతున్న ఓ వ్యాపారిని అదుపులోకి తీసుకున్నప్పటికి స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాకపోవటం పై అధికారుల అలసత్వం కనపడుతుంది… ఏది ఏమైనప్పటికి ప్రజా పంపిణి బియ్యం ఇలా వ్యాపారులకు అక్రమంగా డబ్బులు దండుకొనటానికే ప్రభుత్వం ఈ పంపిణి చేస్తుందేమో అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఎందుకంటే లక్షల్లో అక్రమ వ్యాపారం జరుగుతున్నప్పటికి సంబంధిత అధికారులు అసలు అటు వైపు కూడా కన్నెత్తి చూడక పోవటం పై విమర్శలు విలువడుతున్నాయి… న్యూస్ 10 పత్రిక ఈ రేషన్ బియ్యం దందా పై కథనం ప్రచురించినప్పటికీ… మాకేమి కాదు అధికారులకు అమ్యామ్యాలు ముట్టచెబుతున్నామని ఏమి కాదులే అనుకుంటూ వ్యాపారం కొనసాగిస్తున్నట్టు సమాచారం…. ఇటువంటి వ్యాపారాలునిర్వహిస్తున్న మిల్లు యజమానులు, మిల్లులకు బియ్యం పంపిణి చేస్తున్న వారి పై చర్యలు తీసుకోని, ప్రజలకు అందవలసిన బియ్యాన్ని అక్రమార్కుల జేబులు నింపటానికే కాదని కేవలం ప్రజల కొరకే అని నిరూపిస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు.