ఆస్పత్రికి రానంటూ మొండిపట్టు
ఇంటి వద్దే డాక్టర్ల సపర్యలు.. ఆమె ఒక ఐఎఎస్ అధికారిణి బాధ్యతాయుతమైన పదవిలో కొనసాగుతోంది. అయిన ఆమె తన బాధ్యతను మరిచారు 36 మందికి కరోనా రావడానికి కారణమయ్యారు. విదేశాలనుంచి వచ్చిన తన పుత్ర రత్నాన్ని ఇంటిలో దాచి కరోనా పాలయ్యారు.తనతో పాటు ఒక్కరూ కాదు ఇద్దరు కాదు 36 మందికి కరోనా అంటించారు.దీంతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారిణి పల్లవిజైన్ గొవిల్ వ్యవహారం మరింత వివాదంగా మారింది.ఆమె ది మామూలు పదవి కాదు ప్రజల ఆరోగ్యాలు కాపాడాల్సిన ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ చీఫ్ సెక్రటరీ ఆమె.
కొడుకు ట్రావెల్ హిస్టరీని దాచిపెట్టింది. విదేశాలనుంచి వచ్చిన కొడుకు కారణంగా ఆమెకు కరోనా సోకింది. అది బైటపడేలోపే.. ఆమె ఇతర అధికారులతో కలిపి అనేక సమీక్షలకు హాజరైంది. మొత్తం ఆమె కారణంగా 36మందికి మధ్యప్రదేశ్ వైద్యఆరోగ్య శాఖలో కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో పల్లవి జైన్ హోమ్ ఐసోలేషన్ లో ఉంది. ఆస్పత్రికి రాకుండా.. ఇంటి వద్దకే డాక్టర్లు వచ్చి వైద్యం అందించాలని హుకుం జారీ చేసింది. ఉన్నతాధికారి కావడంతో.. డాక్టర్ల బృందం ఉదయం, సాయంత్రం ఆమెకు వైద్యం అందించడానికి వెళ్తోంది. ఈ వ్యవహారంపై మానవహక్కుల సంఘం సీరియస్ గా స్పందించింది. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని ఆస్పత్రికి ఎందుకు తరలించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.