దేశంలో లాక్ డౌన్ ను మరో రెండు వారాల పాటు కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోడీ ని కోరారు.లాక్ డౌన్ ద్వారా కరోనా విజయవంతంగా కట్టడి చేయగలిగాం అన్నారు.లాక్ డౌన్ కొనసాగింపు తో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతాయని వీటిని తట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు.లాక్ డౌన్ కొనసాగిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నడిచేలా చూడాలన్నారు.దేశవ్యాప్తంగా పంటలు విరివిగా పం డాయని వీటిని నిల్వ చేయడానికి సరైన స్థలం లేదని,ప్రజలకు మూడు నెలలకు కావల్సిన ఆహార ధాన్యాలను అందిస్తే గోదాములు ఖాళీ అవుతాయని ఇక్కడ కొత్తగా సేకరించిన ధాన్యాలను నిల్వచేయవచన్నారు.
మాస్క్ తో ప్రధాని
లాక్ డౌన్ నేపధ్యంలో శనివారం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని మాస్క్ తో పాల్గొన్నారు.రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం మాస్క్ ధరించి పాల్గొన్నారు.కరోనా ఉన్నా,లేకున్నా మాస్క్ తప్పనిసరిగా ధరించాలని వారు మాస్క్ లను ధరించి ప్రజలకు సంకేతాన్ని ఇచ్చారు.