ఉత్పత్తిదారులు సామాజిక బాధ్యతగా ముందుకెళ్లాళ్లాలని పోలీస్ కమిషనర్ సూచించారు . లాక్ డౌన్ నేపథ్యంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలోని పంపిణీదారులతో వరంగల్ పోలీస్ కమిషనర్ శనివారం హన్మకొండలోని నందన గార్డెన్స్ లో ప్రత్యేక సమవేశాన్ని ఏర్పాటు చేశారు.
కరోనా వ్యాధి కట్టడిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజలకు నిత్యవసర వస్తువులు సకాలం అందుబాటులో వుంచడంతో పాటు వస్తు ఉత్పత్తి నుండి ప్రజలకు నిత్యవసర వస్తువులు చేరవరకు నిత్యవసర వస్తువుల పంపిణీలో ఎదురయ్యే సమస్యలను తెలుసుకోవడంతో పాటు రానున్న రోజుల్లో నిత్యవరస వస్తువుల కోరత రాకుండా చేపట్టాల్సిన ముందస్తూ చర్యలపై వరంగల్ పోలీస్ కమిషనర్ స్థానిక నిత్యవసర పంపిణీదారులతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ముఖ్యంగా ఈ సమావేశంలో నిత్యవసర వస్తువుల ఉత్పత్తి, రవాణా, విక్రయించే సమయాల్లో లా డౌన్ కారణంతో పోలీసులు మరియు ఇతర ప్రభుత్వ విభాగాల నుండి ఎదురవుతున్న సమస్యలు, సమస్యలు పరిష్కరించడం కోసం తీసుకోవాల్సిన చర్యలపై వివిధ నిత్యవసర వస్తువుల పంపీణీదారులతో పోలీస్ కమిషనర్ ఈ సమావేశంలో చర్చించారు. అనంతరం పోలీస్ కమిషనర్ పంపిణీదారులను ఉద్యేశిస్తూ మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంతో ప్రజలందరు ఇండ్లకే పరిమితమయ్యారు.
వారికి నిత్యవసర వస్తువులు చాలా అవసరం కాబట్టి, ఈ నిత్యవసర వస్తువులు ఎక్కడ కోరత రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై వుందని. ఇది దృష్టిలో పెట్టుకోని నిత్యవసర వస్తువుల సరఫరా, ధరల నియంత్రణపై పర్యవేక్షించేందుకుగాను ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక అధికారితో పాటు, కమిషనరేట్ పరిధిలో అదనపు డి.సి.పి స్థాయి అధికారిని నోడల్ అధికారిగా ఏర్పాటు చేయడం జరిగిందని. ముఖ్యంగా నిత్యవసర వస్తువుల రవాణాలో ఏదైనా సమస్య వచ్చిందా, ప్రజల డిమాండ్ తగ్గట్లుగానే వస్తు సరఫరా జరుగుతోందా, ఒక వేళ వస్తు సరఫరా సమయంలో జిల్లా లేదా రాష్ట్రాల నుండి ఎదైన సమస్యలు వుంటే వాటిని పరిష్కరించి వస్తు సరఫరా సాఫీగా కొనసాగించేందుకుగా నోడల్ అధికారి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని.
ముఖ్యంగా లాక్ డౌన్ కారణంగా ఎమైనా నిత్యవసర వస్తువులు ఉత్పత్తి డిమాండ్ మరియు సరఫరా సమతుల్యంగా వుందా, ఒక వేళ లాక్ డౌన్ కోనసాగిస్తే ఉత్పన్నమయ్యే సమస్యలు, వాటి పరిష్కార మార్గాల గురించి చర్చించారు. నూరు శాతం వస్తు ఉత్పత్తి చేసేందుకుగాను సంబంధిత పరిశ్రమలకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి ప్రజలకు నిత్యవసర వస్తువులను సకాలం అందజేయడమే లక్ష్యంగా ఉత్పత్తిదారులు సామాజిక బాధ్యతగా సహకరించాలని కోరుతూ పంపీణీదారులతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు డి.సి.పి క్రైమ్స్ తిరుపతి, హన్మకొండ ఎ.సి.పి జితేందర్ రెడ్డి,టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లు మధు, నందిరాంనాయక్, సుబేదారి ఇన్స్పెక్టర్ అజయ్, ఆర్.ఐ భాస్కర్ పాల్గొన్నారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయము