అక్రిడిటేషన్ ఉంటేనే బయట తిరుగు….

న్యూస్10 విలేకరికి శాయంపేట సిఐ వార్నింగ్
పేపర్ లు,టీవీ లు చూడడం లేదా అంటూ బెదిరింపు
సంస్థ ఇచ్చిన ఐడి కార్డ్ చెల్లదట
అక్రిడిటేషన్ కానీ గుర్తింపు కార్డు కానీ చాలని డిజిపి చెప్పిన పట్టించుకోని సిఐ
న్యూస్10 విలేకరి ఫోన్ చేసి వివరణ కోరితే అక్రిడిటేషన్ ఉంటేనే తిరగాలి అంటూ వార్నింగ్

లాక్ డౌన్ వేళా కరోనాను సైతం లెక్కచేయకుండా వార్త సేకరణ కోసం మండల కేంద్రానికి వెళ్లిన న్యూస్10 విలేకరికి తోటి విలేకర్ల కు చెప్పి మరీ వార్నింగ్ ఇచ్చాడు వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట సిఐ రమేష్ కుమార్ … న్యూస్10 విలేకరిని తిరగవద్దని చెప్పు అంటూ కబురు పంపించాడు ఓ విలేకరితో… పోలీస్ తనిఖీల వార్త సేకరణకు వెళ్లిన విలేకరిని గుర్తించి స్థానిక ఎస్సై పంపించగా…. వార్త సేకరణ చేసుకొని ఇంటికి చేరుకున్న శాయంపేట న్యూస్10 విలేకరి సిఐ తనను బయట తిరగవద్దని చెప్పిన విషయం తెలుసుకుని ఫోన్ చేసి… బయట తిరగవద్దని అంటున్నారట ఎందుకని సిఐ ని వివరణ కోరగా…. అక్రిడిటేషన్ ఉంటేనే బయట తిరగాలి…పేపర్ లు, టీవీ లు చూడడం లేదా…? అంటూ బెదిరింపులకు దిగారు…విలేకరులు అక్రిడిటేషన్ ఉంటేనే బయట తిరగాలి అని డీజీపీ చెప్పారని చెప్పిన సిఐ తనకు డిజిపి చెప్పినట్లుగా వాట్సాప్ లో వచ్చిన ఓ మెసేజ్ ను న్యూస్10 విలేకరికి పంపించారు… సిఐ పంపిన ఆ మెసేజ్ లో అక్రిడేషన్ కార్డు కానీ, గుర్తింపు కార్డు కానీ అని స్పష్టంగా ఉంది.
అక్రిడిటేషన్ ఉంటేనే బయట తిరుగు....- news10.app

మరి సంస్థ ఇచ్చిన గుర్తింపు కార్డు శాయంపేట విలేకరికి ఉన్నా….. సదరు సిఐ పనికల్పించుకొని ఒక్క న్యూస్10 రిపోర్టర్ నే ఎందుకు బెదిరించాల్సి వచ్చిందో తెలియదు.. అంతకుముందు తనిఖీల్లో కనపడిన ఓ యూట్యూబ్ చానల్ విలేకరితో ఇప్పుడు వెళ్లిన వానికి (న్యూస్10 విలేకరి) చెప్పు బయట తిరుగొద్దని అంటూ కనీస మర్యాద లేకుండా మాట్లాడడం న్యూస్10 ఆ సిఐ విజ్ఞతకే వదిలేస్తుంది… జర్నలిజం లో ఓ విలేకరికి అక్రిడిటేషన్ కొలమానమని ఎవరు చెప్పారో ఏ ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయో ఆ సిఐ స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది… ప్రజల పక్షాన వకాల్తా పుచ్చుకొని గత సంవత్సర కాలంగా వెలువడుతున్న న్యూస్10 అశేష ప్రజానీకం ఆదరణ పొందింది… కేవలం ఓ సిఐ బెదిరింపులతో వార్త సేకరణ ఆగిపోతుందా….? దీనికి ఆ సిఐ సమాధానం చెప్పాలి… అక్రిడిటేషన్ అనేది ప్రభుత్వం జర్నలిస్టుల సౌకర్యార్థం జారిచేసే కార్డు…. అదే జర్నలిజం లో తారకమంత్రం అనుకుంటే ఎలా… గతంలో ఓ పత్రిక ప్రభుత్వం ఇచ్చే కార్డు లు మాకు వద్దని తీసుకోలేదు… మరి ఆ సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్టులను పోలీసులు బయట తిరగవద్దని అడ్డుకున్నారా….? మీడియా సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఆ సంస్థలు గుర్తింపు కార్డులను జారిచేస్తాయి… ప్రభుత్వ అనుమతులతో సంస్థను స్థాపించి న ఆ సంస్థలు జారీచేసిన గుర్తింపు కార్డులు అసలైనవే కదా…ఈ విషయాన్ని సిఐ గమనించాల్సిన అవసరం ఉంది…నకిలీ జర్నలిస్ట్ లను సిఐ గుర్తించాలనుకుంటే గుర్తింపుకార్డు లను పరిశీలించి వారి సంస్థలకు ఫోన్ చేసి నిర్దారించుకోవాలి… అంతేకాని ఫోన్ చేస్తే వార్నింగ్ లు ఇవ్వడం, తోటి విలేకరులకు చెప్పి తిరగద్దని చెప్పండి అంటూ బెదిరించడం సరైంది కాదు.