ఏప్రిల్ నెలాఖరు వరకు లాక్ డౌన్ పొడిగింపు……?

ఏప్రిల్ నెలాఖరు వరకు దేశం లో లాక్ డౌన్ పొడిగింపు ఉంటుందని సంకేతాలు కనిపిస్తున్నాయి.ప్రధాని మోడీ ప్రస్తుతం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏప్రిల్ 30 వరకు కొనసాగించాలని చెప్పినట్లు సమాచారం.మరోవైపు రాష్ట్రాలకు తాను 24గంటలు అందుబాటులో ఉంటానని ఏ కష్టం ఉన్న తనకు చెప్పు కోవచ్చని మోడీ ముఖ్యమంత్రులతో అన్నట్లు తెలిసింది .ఇప్పటికే పంజాబ్ రాష్ట్రం ఏప్రిల్ 30వరకు లాక్ డౌన్ కొనసాగిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.

ఏప్రిల్ నెలాఖరు వరకు లాక్ డౌన్ పొడిగింపు......?- news10.app

రెడ్ జోన్ లకు మాత్రమే పరిమితం చేయాలి
కాగా లాక్ డౌన్ ను రెడ్ జోన్ ప్రాంతాలకే పరిమితం చేయాలని,మిగతా ప్రాతాలలో దశలవారీగా లాక్ ఎత్తి వేయాలని అభిప్రాయం వచ్చినట్లు తెలిసింది.మోడీ వీడియో కాన్ఫరెన్స్ లో 15రాష్ట్రాల ముఖ్య మంత్రులు లాక్ డౌన్ పొడిగింపునకు సుముఖత వ్యక్తం చేయగా మిగతా వారు భిన్న అభిప్రాయాలు వెల్లడించినట్లు తెలిసింది.కాగా లాక్ డౌన్ విషయమై ఈ రోజు సాయంత్రం ప్రధాని మోడీ ఓ ప్రకటన చేయనున్నట్లు తెలిసింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here