చేపలకోసం తూము షట్టర్ ధ్వంసం….

శాయంపేట లో చేపల వ్యాపారుల ఇష్టారాజ్యం
వృధాగా పోతున్న నాగ సముద్రం చెరువు నీళ్లు…. ఆందోళనలో రైతాంగం
తూము షట్టర్ ధ్వంసం చేసిన వారిపై చర్యలేవి…?
పట్టించుకోని అధికారులు ప్రజా ప్రతినిధులు.

శాయంపేట మండలం లోని నాగసముద్రం చెరువు 868 ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చెరువులు కుంటలు నిండి సమృద్ధిగా నీరు నిల్వ చేసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాసంగి పంటలను దృష్టిలో పెట్టుకొని గత కొన్ని నెలలుగా ఎస్ ఆర్ ఎస్ పి కెనాల్ ద్వారా నీటిని అందిస్తుంది. ప్రభుత్వ ఆదేశాలు లెక్కచేయకుండా కొంతమంది మత్స్యకారులు చేపలు పట్టాలని సంబంధిత అధికారులకు రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా నాగసముద్రం చెరువు తూము షట్టర్ లను ధ్వంసం చేసి అక్రమంగా నీటిని వదలడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చేపలకోసం తూము షట్టర్ ధ్వంసం....- news10.app

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న చేపల వ్యాపారులు.

మండలంలోని నాగసముద్రం చెరువు తూము షట్టర్ ని ధ్వంసం చేసి అక్రమంగా నీటిని వదిలి చేపల వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనీ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్న చెరువులు కుంటలు ఏడాది పొడుగునా నీళ్లు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికి ఎవరు పట్టించుకోవడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. నాగసముద్రం తూము షట్టర్ లను ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు.

పట్టించుకోని అధికారులు ప్రజాప్రతినిధులు.

నాగ సముద్రం చెరువు తూము షట్టర్ నీ ధ్వంసం చేసి అక్రమంగా నీటిని వదిలి నా చట్టపరమైన చర్యలు తీసుకోకుండా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితం నాగ సముద్రం చెరువు తూము షట్టర్ లను చేసి, రాత్రి మరో తూము షట్టర్ తెరవడంతో చెరువులో నీరంతా వృధాగా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఇరిగేషన్ అధికారులు నామమాత్రంగా నాగసముద్రం తూములను పరిశీలించి వెళ్లినట్లు సమాచారం.

తూము షట్టర్ లను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలనీ రైతుల డిమాండ్: శ్రీధర్ గౌడ్, ప్రపంచ రెడ్డి

మండలంలోని నాగ సముద్రం చెరువు తూము షట్టర్ లను ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులకు ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినట్లు రైతులు తెలిపారు. రెండు పంటలు వేయడం వల్ల భూసారం తగ్గి తక్కువ దిగుబడి వస్తుందని వైద్యులతో తీర్మానం చేసుకుని యాసంగి పంట వేయలేదని రైతులు తెలిపారు. ఇరిగేషన్ అధికారులకు సమాచారం అందించిన పట్టించుకోవడంలేదని, చెరువులో ఉన్న నీటిని వదలడంతో వృధాగా పోతున్నాయని అన్నారు.