తెలంగాణ రాష్ట్రంలో దీర్ఘ కాల వ్యాధి గ్రస్తులైన చెక్కర వ్యాధి, రక్తపోటు వ్యాధి, కిడ్నీ వ్యాధిగ్రస్థుల వంటి రోగాల వారికీ అత్యవసర సమయంలో మందులు దొరకక తీవ్రంగా అనారోగ్య పాలౌతున్నారు. షుగర్, బి పి, కిడ్నీ సంబంధిత డాక్టర్లు వారికీ సంబంధిత క్లినిక్ లలో మాత్రమే లభించే విదంగా ఎంచుకున్న ఫార్మా కంపెనీ ల మందులను మాత్రమే సూచిస్తూ ప్రిస్క్రిప్షన్స్ రాయడం వలన లాక్ డౌన్ నేపథ్యంలో ఆ మందులు వేరే ఇతర మందుల షాపులలో లభించక రోగులు తీవ్రంగా అనారోగ్యాగానికి గురౌతున్నారు.
ప్రభుత్వం ఓ పి సేవలను మూసివేయడం వలన ప్రైవేట్ క్లినిక్ లలో చికిత్స తీసుకుంటున్న రోగులు ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులలో ఓ పి లకు చికిత్స జరిగే విదంగా, అలాగే సంబంధిత క్లినిక్ లోని మందులను అమ్మేవిదంగా మెడికల్ షాపులను తెరవాలని రోగులు,సంబంధిత బంధువులు కోరుకుంటున్నారు. డాక్టర్లు కూడా ప్రిస్క్రిప్షన్ రాసేటప్పుడు ఒక్కో మెడిసిన్ కు ప్రత్యామ్న్యాయ మెడిసిన్ ను సూచించే విదంగా రోగులకు మందులను రాయాలని వ్యాధిగ్రస్థులు కోరుకుంటున్నారు.