టీఆర్ఎస్ లో టికెట్ ల లొల్లి
తెలంగాణ ఉద్యమకారులకే తెలంగాణ రాష్ట్ర సమితిలో స్థానం లేదని. తెలంగాణ ఉద్యమ ద్రోహులకు ఏనాడు జై తెలంగాణ ఆనని, నేతలకు మంత్రి పదవులు ఇస్తూ పదోన్నతి ఇస్తూ, టిఆర్ఎస్ పార్టీ అధినేత వారికి, అండగా నిలుస్తూ, ఉద్యమకారులకు అన్యాయం చేస్తున్నారని తెలంగాణ ఉద్యమకారులు ఆవేదన చెందుతున్నారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో తనకు పార్టీ నుంచి టికెట్ ఇవ్వాలని టీఆర్ఎస్ మహిళ నేత తుమ్మల శోభారాణి భవనం పై కెక్కి గురువారం నిరసన వ్యక్తం చేసింది. టిక్కెట్ ఇస్తామని ప్రకటించేదాక బిల్డింగ్ దిగేది లేదని భీష్మించుకు కూర్చుంది.
గురువారం సుబేదారి లోని అమరవీరుల స్థూపం ఎదురుగా గల ఉన్న బిల్డింగ్ పైకి, ఎక్కి ఆత్మబలిదానం చేసుకుంటానని పెట్రోల్ డబ్బా పట్టుకొని తనకు న్యాయం చేస్తారా ఆత్మబలిదానం చేసుకోవాల… అంటూ ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులకు, స్థానిక ఎమ్మెల్యే కు ఆమె హెచ్చరించారు. దింతో హన్మకొండలో టెన్షన్ వాతావరణం నెలకొంది… ఉదయం 8:30 గంటలకు భవనం పైకి ఎక్కిన శోభారాణి ఎవరెన్ని చెప్పిన, మధ్యవర్తిత్వం వహించిన వినకుండా సాయంత్రం వరకు భవనం పైనే ఉంది. భవనం పైనే నీరసన వ్యక్తం చేస్తున్న శోభారాణి తో న్యూస్10 ప్రతినిధి ఫోన్ లో మాట్లాడగా తన ఆవేదనను వెలుబుచ్చింది… తాను తెలంగాణ ఉద్యమంలో పాల్గొని సుమారు 150 కేసులు ఎదుర్కొని, ఇప్పటికీ రైల్వే కేసుల్లో తిరుగుతున్న తనకు అన్యాయం జరుగుతోందని ఆవేదన చెందింది. నిజాయితీగా పార్టీ కోసం పని చేస్తూ, తన కుటుంబానికి పిల్లలకు దూరమయ్యానని విలపించారు. పార్టీలోచురుకైన పాత్ర పోషిస్తూ తనకు ఉన్న ఇంటిని సైతం అమ్ముకోవడం జరిగిందని, ఆమె న్యూస్10 ప్రతినిధి కి చెప్పారు. టికెట్ కావాలంటే 50 లక్షల రూపాయలు కావాలని మాట్లాడటం ఎంతవరకు సబబు అని ఆమె టీఆర్ఎస్ నాయకులను నిలదీశారు. టికెట్ కావాలని అడిగితే 50 లక్షలు కావాలని పశ్చిమ ఎమ్మెల్యే తనను అడిగారని శోభ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సమితి లో ఇంతటి అన్యాయం, జరుగుతుంటే స్థానిక మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు చోద్యం చూడడం ఉద్యమకారులకు ద్రోహం చేయడం కాదా అని ప్రశ్నించారు. తనకు 58 వ డివిజన్ టికెట్ ఇవ్వకపోతే, ఆత్మబలిదానం కూడా చేసుకోవడానికి, తాను వెనుకాడనని ఆమె పదే పదే హెచ్చరించారు. ఈ విషయంలో మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ స్పందిస్తూ, మీకు న్యాయం చేస్తాను, అని హామీ ఇవ్వడంతో పాటు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి జనార్దన్ గౌడ్ పంపడం జరిగిందని ఆమె తెలిపారు. ఎవరెన్ని చెప్పినప్పటికీ టిక్కెట్ తనకు ఖరారు ఐతే తప్ప తాను, బిల్డింగ్ పైనుండి దిగనని లేకుంటే దూకేస్తానని ఆమె అన్నారు.
నాయకులు స్పందించారా… ఉద్యమకారుల ఆగ్రహం
ఉదయం 8:30 కు బిల్డింగ్ ఎక్కి ఆత్మబలిదానం చేసుకుంటామని, తెలంగాణ ఉద్యమ మహిళా నాయకురాలు శోభారాణీ హెచ్చరించినప్పటికీ, అధికార పార్టీ నేతలు స్పందించకపోవడం పై, మరికొంతమంది ఉద్యమనేతలు మహిళలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు.
ద్రోహులకే పదవులు: టిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు రహిమున్నిసా బేగం
గత 20 ఏళ్లుగా కోసం పని చేస్తున్న తమకు న్యాయం జరగడం లేదని, ఇప్పుడే వచ్చిన తెలంగాణ ద్రోహులకు మాత్రం పదవులు లభిస్తున్నాయని టిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు రహిమున్నిసా బేగం ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, కేసీఆర్ మంత్రి కేటీఆర్ ఉద్యమకారుల పట్ల చిత్తశుద్ధి ప్రదర్శిస్తుంటే, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, తమ కుటుంబాలకు తమ బంధువులకు టికెట్లు ఇచ్చుకుంటూ ఉద్యమకారులకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు.
ఉద్యమ కారులకు స్థానం లేదు…. టీఆర్ఎస్ మహిళ నేత బోడ శ్రీజ నాయక్
టీఆర్ఎస్ మహిళ నేత బోడ శ్రీజ నాయక్ మాట్లాడుతూ… టిఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు స్థానం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్నప్పటికీ, తమ లాంటి ఉద్యమకారులకు టికెట్ ఇవ్వడం లో స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు నిర్లక్ష్యం వహించడం ఉద్యమకారులను అవమానపరచడమే అని ఆమె ఆరోపించారు.
ఉద్యమ ద్రోహులే పాలిస్తున్నారు… న్యాయవాది సిద్ధం యుగంధర్
తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించినా న్యాయవాది సిద్ధం యుగంధర్ మాట్లాడుతూ…. టిఆర్ఎస్ పార్టీలో అన్యాయమే రాజ్యమేలుతుందని, పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమకారులకు అవమానం, జరుగుతుందని ఆయన ఆరోపించారు. సకల జనుల సమ్మె చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, వచ్చిన తెలంగాణలో తెలంగాణ ద్రోహులే పాలన సాగిస్తున్నారని ఆయన ప్రత్యక్షంగా టిఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు.
ఆరోపణలు అవాస్తవం… న్యూస్10 తో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్
58 వ డివిజన్ నుంచి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా టిక్కెట్ ఇవ్వాలంటూ, బిల్డింగ్ పైకి ఏక్కి ఆరోపణలు చేస్తున్న, తుమ్మల శోభారాణి, మాటలన్నీ అసత్య ఆరోపణలు అని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ న్యూస్10 తో అన్నారు. శోభారాణి ఆరోపణలపై న్యూస్10 ప్రతినిధి వివరణ కోరగా ఆయన స్పందించారు. ఉద్యమకారులకు డబ్బులు సహాయం చేసే తత్వమే, ఉంది తప్ప టికెట్ల కేటాయింపులో, డబ్బులు అడిగే మనస్తత్వం కాదని, టిక్కెట్ కు 50 లక్షలు అంటూ శోభారాణి మాట్లాడడం, ఆమెకు తగదంటూ ఆయన తెలిపారు. ఆమె ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఐదు లక్షలు పార్టీ నుంచి ఇప్పించింది తానే అనే విషయాన్ని ఆమె విస్మరించ వద్దన్నారు.