స్ఫూర్తి ప్రదాత మాజీ మంత్రి దాస్యం ప్రణయ భాస్కర్..
టికెట్ వచ్చినా రాకున్నా.. దాస్యం వినయ్ మాటే నాకు శిరోధార్యం..
2005లో పార్టీలో చేరా. ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీ బలోపేతానికి పాటుపడ్డ.. నాకు తప్పక టిక్కెట్ వస్తుందని ఆశిస్తున్నా..
నన్ను గెలిపించ బోయే ఆరో డివిజన్ ప్రజలకు, 24 గంటలు అందుబాటులో ఉంటా.. విద్య ఆరోగ్యం నీటి సరఫరా పై ప్రత్యేక దృష్టి సారిస్తా..
ప్రజా సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వస్తున్నా.. అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన తాను, రాజకీయాల్లోకి రావడానికి, మాజీ మంత్రి స్వర్గీయ దాస్యం ప్రణయ భాస్కర్ కాగా, రాజకీయ గురువు వినయ్ భాస్కర్.. నిస్వార్ధంగా పార్టీ బలోపేతం కోసం పనిచేసే తాను ఏనాడు పదవులు కోరుకోలేదు. దాస్యం కుటుంబానికి తానెప్పుడూ వినయ విధేయతలు కనబరుస్తా.. 94 సంవత్సరంలో దాస్యం ప్రణయ భాస్కర్ తో కలిసి TDPలో పని చేశా.. 2005 లో టిఆర్ఎస్ పార్టీలో చేరా.. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ పదవినీ ఆశించలేదు… స్థానిక ఎమ్మెల్యే వినయ్ చెప్పిన మాట శిరోధార్యంగా భావించి పనులు చేశా… స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ తో పాటు, జమాతే సభ్యుడిగా, అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించా.. కరోనా కష్టకాలంలో సుమారు 400 మందికి నిత్యవసర వస్తువులు పంపిణీ చేశా.. వారి ఇంటి వద్దకు వెళ్లి ఇంటి ముందు పెట్టి వచ్చా.. పేరు ప్రతిష్టల కోసం కాకుండా పేదలకు సేవ చేయాలనే సంకల్పంతో పేద విద్యార్థులు చదువుకోవడానికి ఫీజులు కట్టా .. తాను మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న… TRS పార్టీతోనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని భావించి, 6 వ డివిజన్ నుంచి, దాస్యం వినయ్ ఆశీస్సులతో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అంటున్న…. మహమ్మద్ అబ్దుల్ కుదిస్, తో న్యూస్10 ప్రత్యేక ఇంటర్వ్యూ.
న్యూస్ 10 : మంచి వ్యాపారవేత్తగా ప్రత్యక్షంగా పరోక్షంగా పేద ప్రజలకు సేవలు అందిస్తున్న మీరు, ఎందుకు హఠాత్తుగా రాజకీయాల్లోకి రావాలి అనుకుంటున్నారు?
మహమ్మద్ అబ్దుల్ కుదిస్: మాజీ మంత్రి స్వర్గీయ దాస్యం ప్రణయ భాస్కర్, ప్రజలకు చేసిన సేవ తను రాజకీయాల్లోకి రావడానికి కారణం.. 2009లో సౌదీలో ఉద్యోగానికి రాజీనామా చేసి, వరంగల్ కు వచ్చిన తనకు దాస్యం కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయి.. ఇప్పటికీ ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నా… ప్రతి నెలా వచ్చే జీతం నుండి 20 శాతం పేద ప్రజలకు ఉచితంగా అందిస్తున్న..
న్యూస్ 10 : ఆరో డివిజన్ నుంచి అనేక మంది ఆశావహులు ఉన్నారు. వారందర్నీ కాదని మీకు టికెట్ వస్తుంది అని ఆశిస్తున్నా రా? టిక్కెట్ రాకుంటే మీ నిర్ణయం ఎలా ఉంటుంది ?
మొహమ్మద్ అబ్దుల్ ఖుద్దూస్ : పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని, దాస్యం వినయ్ ఆదేశాన్ని, పాటించడమే నా లక్ష్యం.. టికెట్ వచ్చినా రాకున్నా, టిఆర్ఎస్ పార్టీలోనే ఉంటా.. తాను కార్పొరేటర్ కానప్పటికీ , స్థానిక ఎమ్మెల్యే సహకారంతో సుమారు కోటి రూపాయల విలువైన అభివృద్ధి పనులు చేశా.. నాకు వినయ్ ముఖ్యం.. ఆయన మాట ముఖ్యం..
న్యూస్10 : ఆరోవ డివిజన్ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు, మీ డివిజన్ లో అనేక సమస్యలు ఉన్నాయి. ?
మొహమ్మద్ అబ్దుల్ ఖుద్దూస్ : 24 గంటలు నా డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటా.. ఎలాంటి సమస్య తనకు తెలియజేసిన వెంటనే ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తా.. ఓ రాజకీయ నాయకుడు కాకుండా, సమాజం పట్ల అవగాహన ఉన్న నాయకుడిగా, నిస్వార్థంగా ప్రజలకు సేవలందిస్తా.. విద్య, వైద్యం, నీటి సరఫరా, పరిశుభ్రత పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తా..