ప్రజా సేవకై వస్తున్నా….!

తెలంగాణ రాష్ట్ర పేరుని ఉచ్చరించే స్థితిలో లేని అప్పటి ప్రభుత్వం లో, అసెంబ్లీ సాక్షిగా గొంతు ఎత్తి చాటిన ఒకే ఒక గొంతు అప్పటి మంత్రి దాస్యం ప్రణయ్ భాస్కర్ ది… అప్పటి నుండి ఇప్పటి వరకు దాస్యం కుటుంబం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించింది. ఉద్యమ నేత కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్ కు కొండంత అండగా నిలిచి ఉద్యమానికి ఊపిరిపోసింది. ఉమ్మడి రాష్ట్రంలో వరంగల్ జిల్లా నుండి ఎన్నికైన ఒకే ఒక ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్. ప్రజలు, ఆయనను పశ్చిమ నియోజకవర్గంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. నియోజకవర్గంలో ఆ కుటుంబానికి మంచి పేరుంది. అంత మంచి పేరు ఉన్న ఆ కుటుంబం నుండి మరో యువనేత ముందుకు రాబోతున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు చేయడంతో పాటుగా, రాజకీయ సూచనలు సలహాలు ఇవ్వడంలో తండ్రిని మించిన తనయుడుగా రాబోతున్న ఆ వ్యక్తి.. దాస్యం అభినవ్ భాస్కర్.. కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెడుతున్నాడు. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా 60 డివిజన్ నుంచి పోటీ చేస్తున్న యువ నేత దాస్యం అభినవ్ భాస్కర్ తో మా న్యూస్ 10 ప్రతినిధి సాయి ప్రదీప్ ప్రత్యేక ఇంటర్వ్యూ…

ప్రజా సేవకై వస్తున్నా....!- news10.app

దాస్యం కుటుంబం అంటేనే ప్రజలకు సేవ చేసేందుకే అని నిరూపించెందుకేనా మీ పోటీ…. ఇప్పటికే ఇద్దరు బాబాయ్ లు రాజకీయాల్లోనే ఉన్నారు.. వారికి, మరింత బలాన్ని చేకూర్చేందుకా…?

అభినవ భాస్కర్ : ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసేందుకే నేను, ప్రత్యేక్షంగా రాజకీయాల్లోకి వస్తున్నా… మా ఇద్దరు బాబాయ్ లా ఆశీస్సులతో పాటు, వడ్డేపల్లి ప్రజల ఆశీస్సులు తనకు తప్పక లభిస్తాయి. నిత్యం ప్రజల మధ్యే ఉంటూ ప్రజలకు సేవ చేస్తా ప్రభుత్వ పథకాలు పేదలకు అందేలా కృషి చేస్తా…

న్యూస్10 : యువ నేతగా మీరు ఎలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు కరోనా కష్టకాలంలో ప్రజలకు ఎలా సేవలందించారు…?

అభినవ్ భాస్కర్ : అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించా.. సర్వోదయ మిత్రమండలి వ్యవస్థాపకుడిగా, పేద విద్యార్థులకు విద్య కోసం ఆర్థిక సాయం అందించా.. పేదల కోసం తపించే నా తండ్రి స్వర్గీయ ప్రణయ్ భాస్కర్ చూపిన మార్గాన్ని ఎంచుకున్నా.. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసా… ఇంకా చేస్తా..

న్యూస్ 10 : అందరు నాయకులు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు, ప్రజా సమస్యల పరిష్కారం అంటూ వచ్చి, పదవులు పొందాక ప్రజలను విస్మరిస్తారు. అందుకే రాజకీయ నాయకులను ప్రజలు విశ్వసించడం లేదు. మీ డివిజన్ ప్రజలకు నగర ప్రజలకు మీరేమి హామీ ఇవ్వబోతున్నారు ?

అభినవ్ భాస్కర్ : ఎన్ని పనులు ఉన్నప్పటికీ, ప్రజల నుండి వచ్చే ఫోన్ కాల్స్ కు తక్షణమే స్పందిస్తా.. డివిజన్లో నెలకొన్న ఎలాంటి సమస్యలనైనా పరిష్కరిస్తా.. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటా.. నేను పుట్టి పెరిగింది వడ్డేపల్లి లోనే… వారికి ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించడం దాస్యం కుటుంబంగా మా అందరి బాధ్యత..

న్యూస్10 : మీ కుటుంబంలో ఏమైనా రాజకీయ గొడవలు ఉన్నాయా? మీరు రాజకీయాల్లోకి రాగానే, తాజా మాజీ కార్పొరేటర్ దాస్యం విజయభాస్కర్ పోటీలో లేరు. ప్రజలు ఈ విషయంలోచర్చించుకుంటున్నారు.ఈ విషయంలో మీరు ఏమైనా చెప్తారా..?

అభినవ్ భాస్కర్ : మా కుటుంబంలో ఎలాంటి కలతలు లేవు. మాదిఅంతా సమిష్టి కుటుంబం.. మా ఇద్దరి బాబాయ్ లా ఆశీస్సులతోనే 60 డివిజన్ కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న.. ప్రజాసమస్యల పరిష్కారం కోసమే ఇక నా పూర్తి సమయాన్ని కేటాయిస్తా…