పైసలుంటేనే పోటీ…?

గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అబ్యర్ధులకు టికెట్, గెలుపు అంశాలతో పాటు మరో అంశం నానా హైరానా పెడుతోందట… వివిధ డివిజన్ లల్లో పోటీచేస్తున్న అబ్యర్థులు ఒకరిని మించి ఇంకొకరు ఖర్చు పెట్టె అవకాశం ఉన్నందున ఈ ఎన్నికల్లో గతంలో కంటే ఇంకా భిన్నంగా డబ్బే ప్రధాన పాత్ర పోషిస్తుందని అబ్యర్థులు కలవర పడిపోతున్నారట. టికెట్ మాట దేవుడెరుగు కానీ ముందుగా కావాల్సిన డబ్బు సమకూర్చుకుందామని అబ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసింది… పార్టీ పై అభిమానం, ప్రజల్లో అబ్యర్ధికి పరిచయాలు, డబ్బు ఈ మూడు దండిగా ఉంటే విజయం నల్లేరు మీద నడకే నని రెండు కాస్తా అటుఇటుగా ఉన్న డబ్బు బలం నెట్టుకొస్తుందని కొంతమంది పార్టీ నాయకులు బాహాటంగానే చెపుతున్నారు… డబ్బులు ప్రభావితం చేయని ఎన్నికలు ఉంటే చెప్పండి అంటూ అక్కడ ఇక్కడ జరిగిన చర్చల్లో ప్రధాన పార్టీల అబ్యర్థులు ఏకంగా సవాలే విసురుతున్నారట… పరిస్థితులు ఎంత అట్టడుగు స్థాయిలో ఉన్న ఆర్థిక ఆరోగ్యం బాగుంటే విజయం ఖాయమని వీరు టికెట్ ఆశిస్తున్న వారికి బల్లగుద్ధి మరీ చెపుతున్నారట.

పైసలుంటేనే పోటీ...?- news10.app

పైసలున్నాయ…?

పైసలున్నాయ … ?టికెట్ ఆశించి ప్రధాన పార్టీ ల నాయకులకు దరఖాస్తు చేసుకున్న ఆశావహులకు ముందుగా ఎదురవుతున్న ప్రశ్న ఇది… ప్రధాన పార్టీల్లో ఎక్కడ చూసినా అబ్యర్థులను నాయకులు ఇదే ప్రశ్న వేస్తున్నారట… డివిజన్ లో పరిచయాలు, ప్రజలకోసం చేసిన కార్యక్రమాలు, ఇతర బలాబలాలు ఇవేమీ అడగకుండా ముందు డబ్బు ఎంత ఉందో చెప్పమని అడుగుతున్నారట… కొందరు నాయకులకైతే ఆశావహుల మాటలపై నమ్మకం లేక డబ్బు ఉన్నట్లు ఆధారం చూపమని అడుగుతున్నారట… దింతో ఎన్నో కొన్ని డబ్బులు నగదు రూపంలో చూపించి మిగతావి ఆస్తి రూపంలో చూపించి అవసరం ఐయితే ఎన్నికల సమయంలో ఫలానా ఆస్తిని అమ్మి డబ్బు తెస్తామని ఆశావహులు ఆయా పార్టీల నాయకులకు మాటిస్తున్నట్లు తెలిసింది… ఇదికూడా లేని కొంతమంది ఆశావహులు టిక్కెట్ పై ఆశలు వధులుకుంటున్నారట.

ఇటీవల నగరంలో జరిగిన ఓ రెండు పార్టీల సమీక్ష సమావేశంలో డబ్బుల గూర్చే మొత్తం చర్చ జరిగిందట… పార్టీ తరుపున 15 లక్షల వరకే రావచ్చు… మీరు అదనంగా ఇంకొన్ని కలిపి 50 లక్షలవరకు సమకూర్చుకోవాలని సూచించారట… ఓ పార్టీ మాత్రం ఏకంగా కోటి రూపాయలు ఉంటే తప్ప పోటీలో దిగవద్దని అన్ని డబ్బులు ఉంటేనే టికెట్ ఇస్తామని ఆశావహుల కు స్పష్టం చేసినట్లు సమాచారం… దింతో ఆశావహులు డబ్బులకోసం పరుగులు పెడుతున్నారట.. డబ్బులు సమకూరనివారి తమ గాడ్ ఫాదర్ లను కలిసి ఏదోఒకటి చేస్తాం. ముందు టికెట్ ఐయితే ఇప్పించమని ప్రాధేయపడుతున్నారట.. ఇది ఇలా ఉంటే ఆశావహులు ఎంతమంది ఉన్న డబ్బే ప్రాముఖ్యత గా ఉంటుందని డబ్బు ఉన్నవారికే టికెట్ ఖాయంగా వస్తుందని ప్రాధాన పార్టీల్లో చర్చ జరుగుతుందట… ఎంత బలం, బలగం ఉన్న డబ్బు డబ్బేనని ఆశవహుల్లో సైతం జోరుగానే ప్రచారం జరుగుతుందట.