ఈసారి గ్రేటర్ ఎన్నికలు చాలా రసవత్తరంగా ఉండేలా కన్పిస్తున్నాయి… నోటిపికేషన్ రాకముందే ఎన్నికల సమరానికి సమాయత్తం అవుతున్న నాయకులు ఓవైపు … అప్పుడే ప్రచారం ప్రారంభించిన ఆశావహులు మరోవైపు ప్రస్తుతం వీరికి తోడు స్వతంత్రులు సైతం ప్రధాన పార్టీలకు తీసిపోని విధంగా ప్రజలను ఆకట్టుకుంటున్నారు… ఆయా డివిజన్లలో ఉన్న స్వతంత్రులు తమ సత్తా చాటేందుకు వ్యూహ రచన చేసుకుంటున్నారు… రానున్న గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజలతో సత్సంబంధాలు కలిగిన ఈ స్వతంత్రులు డివిజన్ ప్రజల ఆశీస్సులతో ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
గ్రేటర్ లోని దాదాపు అన్ని డివిజన్లలో వీరు తమ మార్క్ చూపేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు… ప్రతి డివిజన్లలో ఈసారి ఎన్నికల్లో ఇద్దరికి పైగానే స్వతంత్రులు ప్రధాన పార్టీ అబ్యర్ధులతో సమానంగా పోటీ పడబోతున్నట్లు తెలుస్తుంది… మరో వైపు వివిధ పార్టీలనుంచి టికెట్ ఆశించి బంగపడ్డ వారు సైతం స్వతంత్రుల పక్కనే చేరనున్నారు… వీరు కూడా పోటినుంచి విరమించుకోలేక స్వతంత్రులుగా బరిలో దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది… ఇదే గనుక జరిగితే ప్రధాన పార్టీల అభ్యర్థుల సంఖ్యతో సమానంగా స్వతంత్రుల సంఖ్య సైతం ఉండబోతుంది.
ప్రధాన పార్టీల్లో గుబులు…
గ్రేటర్ పరిధిలో అన్ని డివిజన్లలో స్వతంత్రులు ఎక్కువ సంఖ్యలోనే బరిలో నిలిచే అవకాశం ఉండడంతో ప్రస్తుతం ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో అప్పుడే గుబులు మొదలైయింది… స్వతంత్రులు అధికంగా ఉండడం మూలంగా ప్రధాన పార్టీల అబ్యర్థులు పార్టీల వారిగా ఓట్లు చీల్చుకుంటే స్వతంత్రులు గెలుపు బాట పట్టె అవకాశం ఉన్నట్లు వారిలో వారే చర్చించుకుంటున్నారట… ఫివిజన్ లో కాసింత పరపతి అధికంగా ఉన్న స్వతంత్రులు కొందరు గుర్తు విషయంలో ఓటర్లను ప్రభావితం చేస్తే కొన్ని డివిజన్లలో బయటపడే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది.
ఇంకొంతమంది తమకు టిక్కెట్ రాదని తెలిసిన కొంతమంది ప్రధాన పార్టీల నాయకులు పరోక్షంగా స్వతంత్రులకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధం అయినట్లుగా తెలుస్తుంది. ఇలా స్వతంత్రులు ఆయా డివిజన్ ల్లో ఏ బాధరబంది లేకుండా తమ స్వంత నిర్ణయాలతో డివిజన్ లల్లో ఇప్పటికే కలియ దిరుగుతు డివిజన్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారట… వీరి పట్ల ఓటర్లు సైతం సానుకూలంగానే స్పందిస్తూ.. డివిజన్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కారం చేసే కార్పొరేటర్ కావాలని తాము కోరుకుంటున్నామని… పార్టీలతో తమకు సంబంధం లేదని వ్యక్తులే ప్రధానమని వారు కుండ బద్దలు కొడుతున్నారట. దింతో డివిజన్ లు తిరుగుతున్న స్వతంత్రుల్లో ఎక్కడలేని ఉత్సహం వస్తోందట… ఇంకాస్త కష్టపడి ప్రచారాన్ని పరిగెత్తిస్తే తమ విజయం ఖాయమని తమ సన్నిహితుల వద్ద చెపుతున్నారట.
ఇది ఇలావుంటే ఈసారి వివిధ డివిజన్ లల్లో బుజ్జగింపుల పర్వం సైతం ఎక్కువగానే ఉండేట్లు ఉంది… డివిజన్ లల్లో స్వతంత్రులు ఎక్కువ సంఖ్యలో ఉంటే వారిలో అధికంగా ప్రభావితం చేసేవారిని గుర్తించి బుజ్జగించి తమ వైపు తిప్పుకొనేందుకు ప్రాదాన పార్టీల నాయకులు ప్రయత్నం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..మరి వీరి మాటలు స్వతంత్రులు వింటార… లేదా అనేది పక్కన పెడితే గ్రేటర్ ఎన్నికల్లో స్వతంత్రులు ఈసారి ప్రదాన పార్టీలకు చుక్కలు చూపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.