ఏజెన్సీలో అలర్ట్

చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు… నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు… ఏజెన్సీ ప్రాంతంలో కుంబింగ్ తీవ్రతరం చేసిన పోలీసులు అనుమానితులపై ఓ కన్నేశారు… ఎప్పటికప్పుడు ప్రధాన రహదారులపై వాహన తనిఖీలు చేస్తూ అనుమానితులను ప్రశ్నిస్తున్నారు… ప్రధానంగా రాష్ట్రంలోని వరంగల్ ఉమ్మడిజిల్లాలోని భూపాలపల్లి, ములుగు ప్రాంతాల్లో ని ఏజెన్సీలో హై అలర్ట్ కొనసాగుతుంది.

ఏజెన్సీలో అలర్ట్- news10.app

చత్తీస్ గడ్ లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పోలీసులు అప్రమత్తమయ్యారు… చత్తీస్ గడ్ లో ఎన్కౌంటర్ తర్వాత అక్కడ పోలీసుల కుంబింగ్ ఎక్కువ కావడంతో మావోయిస్టులు గోదావరి తీరం వెంట చత్తీస్ గడ్ నుంచి తెలంగాణ లోని ఇవతలి ఒడ్డుకు వచ్చే అవకాశం ఉన్నందున ములుగు, భూపాలపల్లి గోదావరి పరివాహక ప్రాంతం వెంట పోలీసులు తమ గస్తీని మరింత ముమ్మరం చేశారు… గోదావరి ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.. కొత్త వ్యక్తులు ఎవరు కనపడిన ప్రశ్నించి వారి వివరాలు తీసుకుంటున్నారు… మొత్తానికి చత్తీస్ గడ్ ఎన్కౌంటర్ తర్వాత తెలంగాణలో ని ఏజెన్సీ ప్రాంత పోలీసులు అప్రమత్తమయ్యారు.