తెలంగాణలో పెరుగుతున్న కరోన పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. మంగళవారం సాయంత్రం నుంచి ఇప్పటి వరకు 49 కేసులను కొత్తగా గుర్తించినట్లుగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు.తెలంగాణలో పెరుగుతున్న కరోన పాజిటివ్ కేసులు- news10.appబుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 453కి చేరింది. వీరిలో 11 మంది మృతిచెందగా.. 45 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 397 మంది చికిత్స పొందుతున్నట్లుగా మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం 397మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వాళ్లంతా ఆరోగ్యంగానే ఉన్నారని ఈటల రాజేందర్ వెల్లడించారు.

వీరిలోనూ మరికొంత మంది త్వరలో కోలుకుంటారని, మళ్లీ పరీక్షలు నిర్వహించి, కరోనా నెగటివ్‌గా తేలితే డిశ్చార్జి చేస్తామని చెప్పారు.

అయితే, కరోనా భయం తెలంగాణకు 95 శాతం వరకూ తగ్గిందని మంత్రి ఈటల అభిప్రాయపడ్డారు.

ఇకపై రాష్ట్రంలో మరీ ఎక్కువగా కరోనా పాజిటివ్‌‌ కేసులు నమోదు కాకపోవచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన 1,100 మందికి పరీక్షలు చేశామని తెలిపారు. వారు సొంత ప్రాంతాలకు వచ్చాక, దగ్గరగా మెలిగిన 3,158 మందిని వివిధ ప్రాంతాల్లోని 167 క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించామని వెల్లడించారు. వీరిలోనూ కరోనా పరీక్షల కోసం తీసుకున్న 535 నమూనాలకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉందని వెల్లడించారు.

కరోనా రోగుల కోసం ఏర్పాటు చేసిన అన్ని ప్రత్యేక ఆస్పత్రుల్లో సకల సదుపాయాలు కల్పించడంతో పాటు వైద్యులకు కావాల్సిన సమగ్ర సామగ్రిని, కిట్లను అందజేసినట్లు మంత్రి వెల్లడించారు. తెలంగాణలో ప్రస్తుతం 80 వేల పీపీఈ (పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్) కిట్లు ఉన్నాయని.. మరో 5 లక్షల కిట్లకు ఆర్డర్ ఇచ్చినట్లు వివరించారు. ప్రస్తుతం లక్ష N-95 మాస్క్‌లు ఉంటే మరో 5 లక్ష మాస్క్‌లను తెప్పిస్తున్నామని చెప్పారు. 2 కోట్ల సర్జికల్ మాస్క్‌లు సహా, కోటి చేతి గ్లౌజులు, రక్షణ కోసం 5 లక్షల గాగుల్స్ సైతం ఆర్డర్ ఇచ్చినట్లు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here