న్యూస్ 10 ఎఫెక్ట్ నోటీసులు జారీ చేశాము గ్రామ పంచాయతీ కార్యదర్శి కోరండ్ల రమణారెడ్డి.
శాయంపేట గ్రామపంచాయతీ పరిధిలో ఇప్పటివరకు వెంచర్లకు అనుమతులు ఎవరికీ ఇవ్వలేదని గ్రామ పంచాయతీ కార్యదర్శి కోరండ్ల రమణారెడ్డి తెలిపారు. వ్యవసాయ భూమిలో వెంచర్లను ప్లాట్లుగా మార్చి కొనుగోలు చేయడానికి గాని, అమ్మడానికి స్థానిక గ్రామ పంచాయతీ అనుమతులు తీసుకోవాలని అన్నారు. వెంచర్ లో ఏర్పాటు చేసిన రెస్టారెంట్ కు కూడా అనుమతులు లేవని, దాని చుట్టూ ఉన్న సిమెంట్ పోల్ లను మూడు రోజులలో తొలగించకపోతే గ్రామపంచాయతీ సిబ్బంది ద్వారా తొలగించి నష్ట పరిహారం వసూలు చేస్తామని నోటీసులో పేర్కొన్నారు. గతంలో పనిచేసిన గ్రామ పంచాయతీ కార్యదర్శి మామిడి రాజశేఖర్ వెంచర్ ఇతరత్రా వాటికి అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. అధికారులతో చర్చించి ప్రభుత్వ భూమి చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు చేస్తామని రమణ రెడ్డి తెలిపారు.