మెడికల్ గిఫ్ట్స్ కు రెక్కలు…

ఇప్పటి వరకు మెడికల్ రంగంలో వివిధ ఫార్మా కంపెనీలు నాట్ పర్ సేల్ అంటూ ఇచ్చిన సాంపిల్ మందులను రోగులకు విక్రహించిన వారిని చూశాం… గడువు తీరిన మందులను అమ్మిన వారిని చూశాం… వైద్య పరీక్షల పేరుతో వేలకు వేలు బిల్లులు వేసిన వారు ఉన్నారు…. ఇదంతా అందరికి తెలుసు కానీ ఫార్మ కంపెనీలు ఇస్తున్న విలువైన ఉచిత బహుమానాలతో వరంగల్ నగరంలో ఏకంగా ఓ గిఫ్ట్ షాప్ వెలిసింది… ఈ షాపులో రకరకాల టాప్ బ్రాండ్ వస్తువులు లభిస్తాయి… చెప్పులు మొదలుకొని ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల వరకు ఇక్కడ ఏది కావాలన్న కొనుకోవచ్చు…. అమ్మకం బహిరంగమే ఐయిన తెలిసేది మాత్రం కొందరికే … ఎందుకంటే ఎలాంటి అనుమతులు లేనిది కనుక…. ఓరుగల్లు నగర వీధిలో “నయా దందా” సాగుతోంది.

మెడికల్ గిఫ్ట్స్ కు రెక్కలు...- news10.app

ఫార్మ కంపెనీల మందులు వాడిస్తున్న వైద్యులకు “ఫ్రీ”గా ఇవ్వాల్సిన వస్తువులను ఇక్కడ యధేచ్ఛగా అమ్ముకుంటున్నారు. ఈ అనుమతులు లేని అమ్మకాలకు సూత్రదారులు, పాత్రదారులు మెడికల్ రిఫ్లు, గిఫ్ట్ షాపు నిర్వహకులు కావడం బహిరంగ రహస్యంగానే కనిపిస్తోంది. ఆసుపత్రుల్లో డాక్టర్ లకు ఫ్రీగా ఇవ్వాల్సిన “గిఫ్ట్” లను “ఆ” గిప్ట్ షాపుకు తరలించి సరీచప్పుడు కాకుండా సొమ్ము చేసుకోవడం విస్మయం కలిగిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గిఫ్ట్ షాపు పేరుతో గుట్టుగా సాగుతున్న ఈ “నయా దందా” మెడికల్ రిఫ్స్ ల “గిఫ్ట్ రాకెట్” ను తలపిస్తోందని విమర్శలు వస్తున్నాయి.

నగరంలోని ఓ ఇరుకైన సందులో ఈ గిఫ్ట్ షాపు నిర్వహించబడుతోంది. కనిపించీ కనిపించని విధంగా ఓ చిన్నపాటి బోర్డు ఉంటుంది. అసలు అక్కడ గిఫ్ట్ షాపు ఉందా అనే విధంగా ఆ షాపు నిర్వనెహించబడుతోంది. అదేదో రాంగోపాల్ వర్మ సినిమా లో ఉన్నట్లు ఆ షాపు మొట్లు ఉంటాయి. ఆ ఇంట్లో నిర్వహించబడుతున్న షాపులోనికి వెళ్లితేనే అసలు విషయం బోదపడుతోంది. ఆ వస్తువులన్నీ మెడికల్ రిఫ్స్ ద్వారా ఫార్మ కంపెనీలు గిఫ్ట్స్ కింద డాక్టర్లకు, ఆసుపత్రులకు అందించే వస్తువులనేది…. అక్కడికి వెళ్లిన ఎవరైనా ఏమాత్రం పరిశీలించిన ఇట్టే తెలిసిపోతుంది. అయితే ఆ గిఫ్ట్స్ వస్తువులు అక్కడికి ఎలా వచ్చాయనేదే ప్రశ్న. వాటికి ధర నిర్ణయించి అమ్మడం, వినియోగదారులకు కొనుగోలుకు సంబంధించిన బిల్లు కూడా ఇవ్వకపోవడం వెనుక అంతర్యం ఏమిటనేది మరో పశ్న. ఏదేమైనా ఫ్రీ గిప్ట్ లను స్టోర్ చేసి సొమ్ము చేసుకుంటున్నారనేది ముమ్మాటికీ నిజం ఇది మెడికల్ రీప్స్, కొంతమంది కొనుగోలు దారులకు తెలిసిన బహిరంగ రహస్యంగానే కనిపిస్తోంది.

“ఆలీబాబా నలబై దొంగల” తరహలో మెడికల్ రిఫ్స్, గిఫ్ట్ షాపు నిర్వహకులు కుమ్మక్కై నూతన తరహాలో దందా సాగిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అక్రమ అమ్మకాలపై సంబంధిత శాఖలు దృష్టి సారించి “ఆ గిఫ్ట్ షాపు” అసలు గుట్టు రట్టు చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే…..