సర్కార్ భూమి ప్రైవేట్ కు దారి…!

పచ్చని పంట పొలాలు నాశనం చేసి వెంచర్ లు ఏర్పాటు చేస్తున్నారు బడాబాబులు. అక్రమంగా పంట పొలాల్లో వెంచర్లు ఏర్పాటు చేసి అందులో దారి లేకున్నా భవనాన్ని నిర్మించి దర్జాగా ప్రభుత్వ భూమిని వాడుకుంటున్నారు. శాయంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ పశు వైద్యశాల ప్రక్కనే ప్రైవేటు వ్యక్తులు పంటపొలాలు కొనుగోలు చేసి వెంచర్ ఏర్పాటు చేశారు. అందులోనే పక్కా భవనం నిర్మించి బిర్యాని పాయింట్ ఏర్పాటు చేసి తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఇలా ఏర్పాటు చేసిన వెంచర్, దాబాకు దారి లేకపోయిన ప్రభుత్వ భూమిని దర్జాగా వాడుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి.ప్రభుత్వ భూమిని ఎలాంటి అనుమతులు లేకున్నా వాడుతున్న గ్రామపంచాయతీ, ప్రభుత్వ అధికారులు తమకేమీ పట్టనట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినబడుతున్నాయి.. ప్రభుత్వ భూమిని దారి కోసం వాడుతూ ఎంచక్కా ప్రైవేటు వ్యక్తులు రాకపోకలు సాగిస్తున్న అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు అంటున్నారు. ప్రైవేటు వ్యక్తుల పైన గ్రామపంచాయతీ పాలకవర్గం, ప్రభుత్వ అధికారులు నోరు మెదపకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ ఏర్పాటుచేసి పక్కా భవనాన్ని నిర్మించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు వ్యక్తుల పై చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం పట్ల స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు..

సర్కార్ భూమి ప్రైవేట్ కు దారి...!- news10.app

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వెంచర్ యజమాన్యం.

పచ్చని పంట పొలాల్లో వెంచర్లు వేసి పక్కా భవన నిర్మాణం చేపట్టి వెంచర్ యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బంది తో పాటు రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరిస్తున్నారనే గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి. గ్రామ పంచాయితీ అధికారులు ఈ వెంచర్, బిర్యానీ సెంటర్ కోసమే గ్రామంలో ఎక్కడా లేని విధంగా నేరుగా గ్రామపంచాయతీ సిబ్బంది భారీ లైట్లను బిగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యుత్ శాఖ అధికారులు సైతం ప్రైవేటు వెంచర్ యాజమాన్యానికి అండగా నిలిచి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు గా ఇక్కడి వ్యవహారం చూస్తుంటే అర్ధమవుతుంది. గ్రామపంచాయతీ, రెవెన్యూ, విద్యుత్ అధికారులు తలుచుకుంటే ఏమైనా చెయ్యొచ్చు అనేదానికి ఈ ప్రైవేట్ వెంచర్, పక్కా భవనం నిదర్శనం.

ప్రైవేట్ వెంచర్ కు ప్రభుత్వ దారి.?

మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ప్రభుత్వ పశు వైద్యశాల కు అనుకొని ఉన్న ప్రైవేటు వెంచర్ యాజమాన్యం ఈ మధ్యకాలంలో లో ఆ వెంచర్ లో ఓ పక్కా భవనాన్ని నిర్మించింది. అయితే ప్రైవేటు వెంచర్ యాజమాన్యం తమ రాకపోకలను కొనసాగించాలంటే ప్రభుత్వ దారి మాత్రమే ఉంది. ఆ భూమి కొనుగోలు చేసి అందులో పక్కా భవనం నిర్మించే ముందు దారి లేదని వారికి తెలిసినా నిర్మాణం చేసి దారి ఎలాగు లేదు కనుక ప్రస్తుతం ప్రభుత్వ భూమిని దారి కోసం దర్జాగా వాడుకుంటున్నారు ప్రైవేటు వ్యక్తులు. ఇక ఈ విషయం అంతా సంబంధిత అధికారులకు జరుగుతున్న తెలిసిన తమకేమి తెలియదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వ భూమిని వాడుకుంటున్న అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం వల్లే ప్రైవేట్ వెంచర్ యాజమాన్యం తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నదని తెలిసింది… ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే…