హాస్టల్స్ లో కరోన కేసులు నమోదు కావడంతో తల్లిదండ్రుల ఆందోళన
ప్రభుత్వ నిర్ణయంతో ఇంటి దారి పట్టిన విద్యార్థులు
విద్యార్థులతో నిండిపోయిన బస్ స్టాండ్లు…
కరోనాతో మొన్నటి వరకు మూసి ఉన్న విద్యాలయాలు ప్రభుత్వ నిర్ణయంతో తెరుచుకున్న మళ్ళీ కరోనా హాస్టల్స్,పాఠశాలల్లో పెరిగి పోతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు బెంబేలెత్తి పోయారు… ఈ విద్యాసంవత్సరం కాస్త ఆలస్యం ఐయిన పర్వాలేదు కానీ పిల్లల క్షేమం ముఖ్యం అంటూ చాలా మంది తల్లితండ్రులు తమ పిల్లలు హాస్టల్స్ వదిలి ఇంటికి రావాలనే కోరుకున్నారు. కరోనా నిబంధనలు పాటించిన విద్యాలయాలు, హాస్టల్స్ లో కరోనా మహమ్మారి అంతకంతకూ పెరగడం, విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోన బారిన పడడం కలవరపెట్టింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది.
బుధవారం నుంచి అన్ని విద్యాసంస్థలు మూసివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం శాసన సభలో ప్రకటన చేశారు. మెడికల్ కాలేజీలు మినహా, ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలు హాస్టళ్లను బుధవారం నుంచి మూసివేశారు. గత వారం రోజులుగా పాఠశాలల విద్యార్ధులు కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న రాష్ట్రప్రభుత్వం ఇప్పుడే విద్యాసంస్థలను నిర్వహించడం మంచిది కాదు అనే భావంతో, ప్రజల అభీష్టం మేరకే, రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. విద్యాసంస్థలు మూసివేయడంతో, విద్యార్థులంతా తమతమ గ్రామాలకు తరలి వెళుతుండటంతో, హన్మకొండలోని కొత్త బస్టాండ్, ప్రయాణికులతో కిటకిటలాడుతున్నది.
విద్యార్థులు మరియు తల్లిదండ్రులు క్షేమాన్ని కాంక్షించే, విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు, రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఆన్లైన్లో విద్యార్థులకు తరగతులు యధావిధిగా కొనసాగుతాయన్నారు. వారం పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కరుణ కేసులు పెద్దఎత్తున పెరిగిపోతున్న నేపథ్యంలో, విద్యార్థులు కరోనా బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వారు వివరించారు. నగరంలోని అనేక ప్రభుత్వ పాఠశాలలు, విద్యా సంస్థలు బంద్ కావడంతో విద్యార్థులు తమ గ్రామాలకు తరలి వెళ్తున్నారు..