ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ మండలంలో విధులు నిర్వహిస్తున్న తహశీల్దార్ వెలగబెడుతున్న ఘనకార్యం ఇది. నగరంలోని “ఉనికిచర్ల” లో తన భూమి ని ఓ వ్యక్తి కి అమ్మినట్లే అమ్మి ఇప్పుడు కాదుపొమ్మంటున్న పరిస్థితి ఇది. ఎనిమిది గుంటల భూమి కొనుగోలుకు అగ్రిమెంట్ చేసి కొనుగోలు చేసిన వారి దగ్గరనుంచి అప్పటి మార్కెట్ రేటుకు డబ్బులు తీసుకొని ఇప్పుడు మాట మార్చుతున్నాడట… కొనుగోలు దారుడికి మాయమాటలు చెప్పి పిల్లల వివాహ సమయంలో భూమి పనికివస్తుంది కొనుక్కోమని చెప్పి అప్పుడు అమ్మేసి ఇప్పుడు తన భూమి తనకీయమని ఎక్కడలేని డిమాండ్ చేస్తున్నాడట.
అప్పుడు తాను అమ్మిన భూమి ధరకు రెక్కలు వచ్చి విలువ భారీగా పెరగడంతో అమ్మిన భూమి పై ప్రస్తుతం ఆ తహశీల్దార్ కన్ను పడిందట. ఆ భూమి ధర భారీగా పెరగడంతో కొనుగోలుదారుడు చెల్లించిన డబ్బులను తిరిగి చెల్లిస్తాను కానీ ఆ భూమిని ఇవ్వలేనని చేతులెత్తేస్తున్నాడు. దీంతో ఆ భూమిపై ఆశలు పెంచుకున్న బాధిత కుటుంబానికి దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఇదేంటని అడిగిన బాధిత కుటుంబానికి రెవెన్యూ పవర్ చూపిస్తున్నాడు ఆయనగారు. ఆ తహశీల్దార్ అంతటితో ఆగకుండా తన సంబంధికులైన పెద్దమనుషులను కూడా రంగంలోకి దింపాడట… బాధితుడు ( కొనుగోలు దారుడు ) చెల్లించిన డబ్బులను తిరిగి తీసుకొని తోకముడుచుకొని ఉండాలని ఆ పెద్దమనుషులు బాధితుని పై ఒత్తిడి తెచ్చెందుకు తమదైన శైలిలో పని మొదలు పెట్టారట.
పలుకుబడి కలిగిన వ్యక్తుల మధ్య ఓ ఒప్పందాని కొనుగోలుదారుడిపై ఒత్తిడి తెచ్చారని తెలుస్తుంది… పెద్ద మనుషుల వ్యవహారం అనవసరంగా బాధలు ఎందుకు కొని తెచ్చుకుంటావు… ఇచ్చిన డబ్బులకు రెట్టింపు ఇస్తాడు భూమి వదులుకోమని సదరు పెద్దమనుషులు బాధితుడి కి సలహా ఇస్తున్నారట…. ఈ పెద్ద మనిషులే నగరంలోని ఓ ప్రాంతానికి బాధితుణ్ణి పిలిపించి ఓ ఒప్పంద పత్రం రాయించి బలవంతంగా సంతకం కూడా చేయించారట… దింతో తీవ్ర మానసిక వేదనకు గురైన బాధితుడు డబ్బులు సైతం తీసుకోకుండా వెళ్లిపోవడంతో ఎలాగైనా ఒప్పించి తహశీల్దార్ దగ్గర మార్కులు కొట్టేయాలని ఆ పెద్దమనుషులు విశ్వ ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.. నాలుగు మంచి మాటలు చెప్పి తానే భూమిని కొనేలా చేసి డబ్బులు తీసుకొని భూమిని అమ్మిన తహశీల్దార్ తిరిగి తన భూమి తనకు కావాలని కొనుగోలుదారుడిపై తీవ్ర ఒత్తిడి చేయడంతో ఆ బాధిత కుటుంబం తీవ్ర ఆవేదన చెందుతుంది… తన కుమారుడి పేరుపై ఉన్న ఈ భూమిని అమ్మేసిన తహశీల్దార్ తన రెవెన్యూ ఆలోచనలను ఓ సామాన్యుడిపై ప్రయోగిస్తుండడంతో వారు ప్రస్తుతం తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఉన్నారట.
ఆ తహశీల్దార్ ఘనకార్యం ఏమిటి..? మధ్యవర్తుల కథేంటీ..? పేరున్న పెద్దమనుషులెవరు..? ఇంతకీ ఆ తహశీల్దార్ ఎవరు..? ఉనికిచర్ల భూమి కథేంటీ..? సమగ్ర వార్త వరుస కథనాలు న్యూస్ 10 ఫొస్ట్ మార్టం రిఫోర్ట్ లో త్వరలో….