‘చుక్క’ల సాక్షిగా దోపిడీ….?

  • భూపాలపల్లి ఆర్టీఏ లో…… అవినీతి చుక్కల ధరల పెంపు
  • ఆర్టీఏ ఆఫీసులో బ్రోకర్లదే హవా…వారు లేనిది పైల్ కదలదు
  • అధికారులు గుర్తించేలా చుక్కల మార్గం ఎంచుకున్న బ్రోకర్లు
  • చుక్క లేకుండా వస్తే… చుక్కలు చూపెడుతున్న అధికారులు
  • ప్రైవేట్ ఏజెంట్ ల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్న అధికారులు
  • ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేసిన అధికారులు
  • చుక్కల మార్గం ద్వారా లక్షలు కొల్లగొడుతున్న అధికారులు?
  • అర్ధరాత్రి తనిఖీల పేరుతో అక్రమ వసూళ్లు…?

ధరల పెంపుతో దర్జా….?

'చుక్క'ల సాక్షిగా దోపిడీ....?- news10.app

భూపాలపల్లి రవాణా శాఖ కార్యాలయంలో చుక్కల దందా దర్జాగా సాగుతోంది. రవాణా శాఖ లోని అధికారులు వారి తరుపున ప్రైవేట్ అసిస్టెంట్ లను నియమించుకుని లక్షల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి . గతంలో ఎన్నడూ లేని విధంగా… అదేదో అధికారికం అయినట్లు అమాంతం చుక్కల ధరలను పెంచి వాహన దారుల రక్తం తాగుతున్న అధికారుల తీరు విమర్శలకు దారితీస్తుంది. ప్రతి వాహనానికో ధర నిర్ణయించి వాహనదారులను నిలువునా దోచేస్తున్నారు మరీ ముఖ్యంగా జేసీబీ, హార్వెస్టర్ లు కొనుగోలు చేసిన రైతులు రవాణా కార్యాలయంకు రావలంటేనే వణికి పోతున్నారట. లైసెన్స్ కోసం, వాహన రిజిస్ట్రేషన్, ఫిట్ నెస్, తదితర పనులకోసం…. ఎవరైనా సరే అధికారులకు సంబంధించిన ప్రైవేట్ అసిస్టెంట్ లను కలిస్తే చాలు ప్రభుత్వం నిర్ణయించిన ఆన్లైన్ కంటే అధికంగా మూడు రెట్లు డబ్బులు వసూలు చేసి అప్లికేషన్ పై చుక్కేసి పంపిస్తారట. ఆ ధరఖాస్తులపై చుక్కను చూసిన అధికారులు పనిని పక్కాగా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ దందా పై విసుగెత్తిన వాహనదారులు కలెక్టర్ కు గ్రీవెన్సు లో ఫిర్యాదు కూడా చేశారట. జిల్లాలోని ఓ ఎమ్మెల్యే ను సైతం కలిసి ఆర్టీఏ ఆఫీసులో జరుగుతున్న దందాను అధికారుల తీరుపై స్పందించాలని కోరినట్లు సమాచారం. స్పందించిన ఎమ్మెల్యే సదరు అధికారులను హెచ్చరించినట్లు వినికిడి అయినా కూడ అధికారులు వారి పద్ధతి మార్చుకోకుండా చుక్కల ధరలను మూడు రెట్లు అధికంగా పెంచి వారి అక్రమ దందా కొనసాగిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

చుక్కల ధరలకు.. రెక్కలు..?

భూపాలపల్లి రవాణా శాఖ కార్యాలయంలో చుక్కల దందా జోరుగా నడుస్తోంది… రవాణా శాఖ కార్యాలయంలో పనిచేసే ప్రతి అధికారి తమకు నచ్చిన వారిని ప్రైవేట్ ఆసిస్టెంట్లు గా నియమించుకున్నారు వీరు కార్యాలయం బయట బహిరంగంగా ఆఫీసులు ఏర్పాటు చేసుకొని కార్యకలాపాలు దర్జాగా కొనసాగిస్తున్నారు. గత కొంతకాలంగా ఈ చుక్కల దందా ఆనవాయితీగా వస్తోంది. ప్రతి అధికారికి చుక్కల రూపంలో లక్షల రూపాయలు వచ్చినా అత్యాశతో … ప్రస్తుతం చుక్కల ద్వారా వచ్చే డబ్బులు సరిపోవట్లేదని చుక్కల రేట్లను మూడు రెట్లు పెంచారని బ్రోకర్లు మాట్లాడుతుండడం గమనార్హం.

దర్జాగా ముగ్గురు ప్రైవేట్ ఆసిస్టెంట్ల దందా…?

భూపాలపల్లి రవాణా కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు ముగ్గురు ప్రైవేట్ అసిస్టెంట్ లను ఏర్పాటు చేసుకొని రోజుకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురి సంతకాల చుక్క లేకుండా కార్యాలయంలో ఏ పని కూడా జరగదదట. కార్యాలయంలో ఏ ఫైలు కదలాలన్న ఈ ప్రైవేటు అసిస్టెంట్ల దృష్టిలో ఉండాలట. వీరికి తెలియకుండా ఏ ఫైలు వెళ్లినా అధికారులు తిరస్కరిస్తారట. కార్యాలయంలో పని జరగాలంటే ఎవరైనా వారి దగ్గరికి వచ్చి అడిగింది ముట్టజెప్పుకొని చుక్క వేసుకుంటేనే అధికారులు పనిచేస్తారట. ఈ స్థాయిలో ఆ అసిస్టెంట్ లు హవా కొనసాగిస్తున్నారంటే కార్యాలయంలోని అధికారులు వీరిని ఏ స్థాయిలో ప్రోత్సహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కార్యాలయానికి వచ్చే వాహనదారులనుండి చుక్కల రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని సాయంత్రం అధికారులకు పువ్వుల్లో పెట్టి ముట్టజెప్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇది ఇలా ఉంటే కొంతమంది రవాణా శాఖ అధికారులు రాత్రిఐయిందంటే చాలు జిల్లాలోని ప్రధాన రహదారులపై అడ్డా వేసి రాత్రిపూట తనిఖీల పేరుతో వసూళ్ల దందా చేస్తున్నట్లు తెలియవచ్చింది… కొంతమంది అధికారులు రాత్రిపూట తనిఖీలు చేయకూడదని చెప్పిన అవేమీ పట్టనట్లు తనిఖీలు చేస్తూ తమ అక్రమ దందా హవా కొనసాగిస్తున్నట్లు తెలిసింది.