కరోనా నివారణకై లో విధులు నిర్వర్తించే వైద్యులు సిబ్బందికి పూర్తి భద్రత – డీజీపీ మహేందర్ రెడ్డి

రాష్ట్రంలో కరోనా నివారణలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, హెల్త్ కేర్ నిపుణుల భద్రత, రక్షణకు అత్యంత ప్రాదాన్యత నివ్వాలని పోలీసు దళాలను రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ ఎం. మహేందర్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని ప్రధాన ఆసుపత్రులు, క్వారన్ టైన్ కేంద్రాలలో కోవిద్-19 కేసుల సంబంధిత విధులు నిర్వహించే వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి తగు భద్రత, రక్షణ కల్పించడానికి గాను తమ పరిధిలోని పోలీస్ అధికారులు, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ తో కూడిన ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ లను తక్షణమే ఏర్పాటు చేసుకోవాలని పోలీస్ కమిషనర్ లు, ఎస్పీలకు డీజీపీని సూచించారు.

కరోనా నివారణకై లో విధులు నిర్వర్తించే వైద్యులు సిబ్బందికి పూర్తి భద్రత - డీజీపీ మహేందర్ రెడ్డి- news10.app

అత్యవసర పరిస్థితుల్లో స్పందించి సకాలంలో తగు చర్యలు చేపట్టే విధంగా రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో కూడా సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పోలీస్ అధికారులతో కూడిన వాట్సాప్ గ్రూపులను కూడ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. కరోనా నివారణ విధుల్లో ఉన్న డాక్టర్లు, వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడే వారిపట్ల కఠిన చర్యలు చేపట్టడంతోపాటు స్థానికంగా డాక్టర్లు ఇతర వైద్య సిబ్బంది భద్రత, రక్షణ కల్పించడానికి వారితో నిరంతరం టచ్ లో వుండాలని మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. కరోనా నివారణకై నిర్విరామంగా విధులు నిర్వర్తిస్తున్న వైద్య సిబ్బందికి అండగా ఉండేందుకు గాను రాష్ట్రస్థాయిలో, జిల్లాస్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ సీనియర్ అధికారులతో నిరంతరం టచ్ లో ఉండాలని పోలీస్ కమిషనర్లు, జిల్లా సూపరింటెండెంట్ లను డిజిపి ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here