దేశంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఈ నెంబర్ కి కాల్ చేయండి అంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కోరారు. రాజకీయాలు పక్కనపెట్టి ,కరోన మహమ్మారిని ఎదుర్కొనేందుకు పోరాడే సమయమిది అని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు రాత్రి 9 గంటలకు ప్రతి ఇంటి గుమ్మం ముందు దీపం 9 నిముషాలు వెలిగించండి అని ఆయన కోరారు. కేవలం లైట్స్ మాత్రమే అపి దీపాలు వెలిగించండి అని కోరారు. దీపం వెలిగించి అసతోమా జ్యోతిర్గమయా,తమసోమ జ్యోతిర్గమయా అంటూ చీకట్లు పారద్రోలుదామని ఆయన పిలుపు నిచ్చారు. అలాగే మన దేశంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు 1930 కాల్ సెంటర్ కి ఫోన్ చేయండి అని ఆయన కోరారు. మీ కోసమే 24 గంటలు కంట్రోల్ రూమ్ సేవలందిస్తుందని ప్రజల ప్రాణాలు కాపాడటమే మా ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇక ఈశాన్య రాష్ట్రాల వాళ్లు అయితే సహాయం కోసం 1944 కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు. ఇక డాక్టర్ల పై దాడి చేయడం సిగ్గుచేటన్న ఆయన అటువంటి వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. ఈ తరహా ఘటనల మీద ఆయా రాష్ట్ర డీజీపీలు, సీఎస్ లు చర్యలు తీసుకోవాలని అన్నారు.