ఉద్యమకారుడి గోస…

ఇది చూసైనా ఎమ్మెల్యే మనసు కరిగేనా…?
మూడు పి జి లు పూర్తి చేసిన కానరాని ఉపాధి
కష్టపడి కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదిస్తే…పి డి పి పి కేసుతో రాకుండా పోయింది
వ్యవసాయాన్ని నమ్ముకుంటే విష పురుగు కుట్టి కాలే పోయేలా ఉంది
ఇప్పటికి చికిత్స కు ఐయిన ఖర్చు 4 లక్షల పైనే
హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స… వైద్య ఖర్చులు ఇంకా పెరిగే అవకాశం
ఉద్యమకారులకు సాయం చేసి ఆదుకోవాలని పరకాల ఎమ్మెల్యే కు వేడుకోలు

తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని స్వరాష్ట్రామ్ సాధించాలన్న తపనతో వివిధ కార్యక్రమాలలో పాల్గొని లాఠి దెబ్బలు తిని,జైల్ పాలయి, తెలంగాణ రాష్ట్రం సిద్దించిన ఇప్పటికి ఆదుకునేవారు లేక అల్లాడుతున్న తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడి దీన గాధ ఇది… ఉద్యమకారుల బాధలను చాలా తేలికగా తీసుకొనే నాయకులకు ఇదో మచ్చు తునక మాత్రమే… మూడు పీజీ లు పూర్తి చేసి, వచ్చిన కానిస్టేబుల్ ఉద్యోగం పి డి పి పి రైల్వే కేసు వల్ల పోతే ఆర్థికంగా చితికిపోయి కేవలం బతకడానికి అరి గోస పడుతున్న సర్కార్ సాయం ఏమాత్రం అందని ఉద్యమకారుడి బతుకు వెత ఇది… ఉద్యమంలో పాల్గొని ఎంతో నష్టపోయి కనీసం బతుకుదెరువు కూడా లేని తమను ఆదుకోమని వేడుకుంటే కనీస కనికరం ఎందుకు కలగడం లేదని ప్రశ్నిస్తున్న ఉద్యమ కారుడి ఆవేదన ఇది… తెలంగాణ ఉద్యమంలో ఎంతో చురుకుగా పాల్గొన్న ధర్మారం, గొర్రెకుంట ఉద్యమకారుల్లో గణేశ్ ఒక్కరు.తన ఉద్యమ కష్టాలను ప్రస్తుతం అనుభవిస్తున్న కష్టాలను, పరకాల ఎమ్మెల్యే తమ పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని న్యూస్10 కు వెల్లడించారు.

ఉద్యమకారుడి గోస...- news10.app

ఏ ఆసరా లేకుండా తాను పడుతున్న గోసను వెళ్లబోసుకున్నాడు. ఉద్యమ సమయంలో రైల్వే పి డి పి పి యాక్ట్ కింద కేసు పెడితే జైలు శిక్షను అనుభవించిన వాడు గణేష్ గొర్రెకుంట గ్రామానికి చెందినవాడు… తెలంగాణ జే ఏ సి పిలుపునందుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అనేక కేసులు ఎదుర్కొని రాష్ట్ర సాధనకోసం అన్ని ఆందోళనల్లో ముందు వరుసలో నిలిచిన వాడు. బి యి డి, ఎం ఏచ్ ఆర్ ఎం, ఎం బి ఏ పూర్తి చేసి ఉద్యమ పరంగా ఎన్ని కష్టాలు ఎదురైన అధిగమిస్తూ ఉన్నత విద్యను కొనసాగించాడు. తెలంగాణ రాష్ట్రం రాగానే తమ కలలు నెరవేరుతాయని ఆశించాడు… కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ధరకాస్తూ చేసుకొని ఉద్యోగం సాధించాడు… ఉద్యోగంలో చేరడానికి పోలీసులు నిర్వహీంచిన విచారణలో పి డి పి పి కేసు ఉందని తేలడంతో ఉద్యోగం కోల్పోయాడు…అసలే రైల్వే కేసు కావడంతో ఏ ఉద్యోగం కోసం ధరకాస్తూ చేసుకున్న ఉద్యోగం వచ్చిన విచారణలో పోతుందని తెలిసి ఇక ఉద్యోగ ప్రయత్నాలు మానేశాడు… ఖాళీగా కూర్చుంటే తిండి దొరకడం కష్టం తండ్రిని కోల్పోయి ఇప్పటివరకు తల్లి కష్టం మీదనే ఆధారపడి జీవిస్తున్న గణేష్ తనకున్న భూమిలో వ్యవసాయం మొదలుపెట్టాడు.

దురదృష్టవశాత్తు కాలిపై విషపురుగు కుట్టడంతో ఇన్ఫెక్షన్ తో బాధపడ్డాడు. ప్రస్తుతం కాలు కండ నంత తొలగించి డాక్టర్లు చికిత్స చేస్తున్నారు… హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం గణేష్ తన పరిచయస్తుల దగ్గర అప్పు చేసి నాలుగు లక్షలకు పైగానే ఖర్చు చేసాడు… అతను పూర్తిగా కొలుకోవడానికి ఇంకెంత ఖర్చు అవుతుందో తెలియని పరిస్థితి… ఇంకా చికిత్స కొనసాగుతూనే ఉంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని కేసుల వల్ల ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హుడి గా మారి ప్రస్తుతం గణేష్ తీవ్ర వేదనను అనుభవిస్తున్నాడు. ప్రభుత్వ సాయంకోసం ఎదురుచూస్తున్న పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి తమ పట్ల కనీస కనికరం లేకుండా వ్యవహరిస్తుండడం వల్ల దిక్కు తోచని స్థితిలో తాను మిగతా ఉద్యమకారులు ఉన్నారని గణేష్ ఆవేదన చెందాడు.

వరంగల్ ఉమ్మడి జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఉద్యమకారులకు సాయం అందిన కేవలం పరకాల నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉందని అన్నారు. ఎమ్మెల్యే కు సాయం చేయాలని ఉన్న కొంతమంది భజన పరులు ఆయన చుట్టూ చేరి ఉద్యమకారులకు సాయం చేయకుంటే ఏమికాదని… లేని పోనీ అవగాహన లేని పనికిమాలిన సలహాలు ఇస్తున్నారని అందుకే ఎమ్మెల్యే సాయం అందేలా చేయనని తెగేసి చెబుతున్నారని కేటీఆర్ ఇచ్చిన మాటను నిలిపేలా ఎమ్మెల్యే చొరవచూపితే ఏంటని గణేష్ ప్రశ్నించారు… కనీసం తాను అనుభవిస్తున్న గోసను చూసైనా ఎమ్మెల్యే ఉద్యమకారులకు సాయం చేయాలని వేడుకున్నారు… ఎమ్మెల్యే కనీస కనికరం తమపై చూపాలని కోరుతున్నాడు.