కలెక్టర్ సార్… ఇదేంది?

కబ్జా స్థలం వదిలి బతుకమ్మ స్థలంలో ప్రకృతి వనం కడతారా..?.
బతుకమ్మ ఆడుకునేందుకు మాకు స్థలం ఏది..?
కబ్జాకు గురైన 34 ఎకరాలు ప్రకృతి వనానికి పనికిరాద…?
సర్వే నెంబర్28 లో కబ్జాభూమి స్వాదినానికి అధికారులు ఎందుకు వెనుకాడుతున్నారు.
కలెక్టర్ ను ప్రశ్నిస్తున్న అడవి రంగాపూర్ మహిళలు
కలెక్టర్ ఆదేశాలతోనే బతుకమ్మ స్థలంలో ప్రకృతి వనం కడుతున్నామంటున్న సర్పంచ్

కలెక్టర్ సార్ కబ్జా భూమిని వదిలి మా బతకమ్మ భూమిని అధికారులు గుంజుకున్నారని ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం అడవి రంగాపురం మహిళలు అంటున్నారు. కలెక్టర్ సార్ చొరవ చూపి గ్రామంలో ఉన్న కబ్జా భూమిని స్వాధీనం చేసుకుంటారని భావిస్తే కబ్జా చేసిన 34 ఎకరాల భూమిలో అక్రమంగా కబ్జా చేసి తిష్ట వేసిన వారిని వదిలి, గ్రామ ఆడపడుచులు ఆడుకునే బతుకమ్మ భూమిని ప్రకృతివనం కోసం కేటాయించడం దారుణమని అడవిరంగపూర్ ఆడపడుచులు ఆవేదన వ్యక్తంచేశారు.

కలెక్టర్ సార్... ఇదేంది?- news10.app

వివరాల్లోకి వెళ్ళితే ములుగు జిల్లా లోని వెంక టాపూర్ మండలం అడవిరంగా పూర్ గ్రామంలో 28 సర్వే నెంబర్ లో 34 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రస్తుతం ఇక్కడ ఒక్కో ఎకరానికి 30 లక్షలపైనే ధర పలుకుతుందట.. ఇలా లక్షలు విలువచేసే ప్రబుత్వ భూములను కొందరు పెద్దమనుషులు తమ పలుకుబడి ని ఉపయోగించి అక్రమంగా పట్టాలు పొంది కబ్జా చేయగా… ఇంకొందరు తెలివిగా దొడ్డి దారిన ప్రభుత్వ భూమి పట్టా కాగానే ఆ భూమిని ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకొని చేతులు దులుపుకొన్నారు. ప్రభుత్వ భూమి కబ్జా విషయం స్థానికులు రెవెన్యూ ఆధికారులకు ఎన్ని సార్లు పిర్యాదు చేసిన పట్టించుకోలేదు… ఈ భూములు పట్టా చేసిన విషయంలో అప్పటి రెవెన్యూ అధికారులు సైతం ఆరోపణలు ఎదుర్కొన్నారు… దీంతో కబ్జా విషయంలో ఎన్ని ఫిర్యాదులు వెళ్లిన వారు సరిగా స్పందించలేదని అనుమానాలు స్థానికులకు ఉన్నాయి. అయితే ఇటీవల ఈ భూముల కబ్జా పై న్యూస్10 పత్రిక ‘ప్రభుత్వభూమి ఫలహారం ‘ శీర్షికన కథనం వెలువరించింది. దీంతో స్పందించిన కలెక్టర్ కృష్ణ ఆదిత్య ప్రభుత్వ భూముల స్వాదినానికి ఆదేశాలు జారిచేయగా రెవెన్యూ అధికారులు కబ్జా దారులకు నోటీసులు ఇచ్చారు…వి చారణకు హాజరు కావాలన్నారు… ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఎంజారిగిందో ఏమో తెలియదు కానీ ప్రస్తుతం ఆ ప్రభుత్వ భూముల స్వాధీనం విషయంలో అధికారులు కనీసం సోఅందించడం లేదు సరికదా కబ్జా ఐయిన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడం మాని గ్రామంలో నిర్మించబోయో పల్లె ప్రకృతి వనానికి గత కొన్ని సంవత్సరాలుగా మహిళలు బతుకమ్మ ఆడుకునే స్థలాన్ని కేటాయించడాన్ని గ్రామ మహిళలు వ్యతిరేకిస్తున్నారు.స్వయంగా కలెక్టర్ కృష్ణ ఆదిత్య తమ గ్రామానికి వచ్చి బతుకమ్మ స్థలంలో ప్రకృతి వనం నిర్మాణానికి ఆదేశాలు ఇవ్వడం, కనీసం కబ్జాకు గురైన భూమిని పరిశీలించకపోవడం, స్వాదీనం విషయంలో కనీసం అధికారులనుమందలించకపోవడంపై గ్రామ మహిళలు నిరాశ వ్యక్తం చేశారు.

కబ్జా భూములను వదిలి ఆడపడుచులు ఆడుకునే బతుకమ్మ స్థలాన్ని ములుగు కలెక్టర్ ఆదేశాల మేరకు అడవిరంగా పూర్ సర్పంచ్ మేకల మహేందర్ ఆ స్థలంలో ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారని , అడవిరంగాపుర్ ఉమ్మడి గ్రామపంచాయితీ ఆడపడుచులు అందరూ బతుకమ్మ అడుకేనే స్థలంలో ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయడం ఎంత వరకు సబబుఅని కలెక్టర్నుని మహిళలు ప్రశ్నించారు. బతుకమ్మ స్థలం ప్రకృతి వనం కోసం స్వాదీనాం చేసుకున్న విషయంలో మహిళలు వారి బాధను వ్యక్తం చేస్తూ ఏడాది కి ఒక్కసారి వచ్చే పండగ కు తాము సంతోషంగా బతుకమ్మ ఆడుకునే వాళ్ళమని ఇప్పుడు తాము బతుకమ్మ ఎక్కడ ఆడుకోవాలని వారు అడుగుతున్నారు. బతుకమ్మ స్థలం పక్కనే ఉన్న కబ్జా భూమిని వదిలి బతుకమ్మ భూమిలో ప్రకృతి వనం ఏర్పాటు సరికాదని అక్రమంగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన కబ్జా దారుల వెంట పడి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని మహిళలు కలెక్టర్ ను కోరారు సర్ మాకు తమకు బతుకమ్మ కోసం స్థలాన్ని కలెక్టర్ కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ప్రభుత్వ భూమి కబ్జా దారుల విషయంలో,బతుకమ్మ స్థలం కేటాయింపు విషయంలో కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.