ఎమ్మెల్యే కు… దళితులంటే చులకన…! – గొర్రెకుంట, ధర్మారం ఉద్యమకారుల ఆరోపణ
అందుకే తమ సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే వెనుకాడుతున్నాడని అనుమానం
ప్రభుత్వం ద్వారా సాయం చేయించమంటే ఎమ్మెల్యే ఎందుకు వెనుకాడుతున్నాడని ప్రశ్న
బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరం తమకు లేదని, అసలు సిసలైన ఉద్యమ కారులమని స్పష్టీకరణ
తమపై ఎమ్మెల్యే తన అనుచరులవద్ద బ్లాక్ మెయిల్ అంటూ ఆరోపణలు చేయడం తగదని హితవు
ఇకనైనా తమకు సాయం అందేలా చొరవచూపి ఆదుకోవాలని వినతి.
తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఎంతో చురుకుగా పనిచేసిన తమకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకుండా పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి అడ్డుపడుతున్నారని, మాట ఇచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు ఉద్యమకారులకు సాయం మాటే ఎత్తడం లేదని గొర్రెకుంట, ధర్మారం విద్యార్థి ఉద్యమకారులు ఆరోపించారు. కేవలం ప్రభుత్వ సాయం కోరుతున్న వారంతా దళితులే కనుక ఎమ్మెల్యే చులకన భావంతో చూస్తున్నారని వారు అన్నారు. తమ సమస్యపై ఇప్పటివరకు కూడా స్పందించని ఎమ్మెల్యే ధర్మారెడ్డి తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు నచ్చిన వారికి, తెలంగాణ ఉద్యమంతో, ఎమ్మెల్యే గెలుపులో ఎంత మాత్రం పాత్ర లేని ప్రధాన అనుచరుడి మాట మాత్రమే ఎమ్మెల్యే వినేలా ఉన్నారని అన్నారు. తాము ఉద్యమంలో పాల్గొని ఆర్థికంగా, విద్యాపరంగా చితికి పోయిన దళితులం కావడం వల్ల ఎమ్మెల్యే తమ సమస్యను చాలా తేలికగా తీసుకొని తమ పట్ల చులకన భావంతో మాట్లాడుతున్నట్లు తెలిసిందన్నారు.
బ్లాక్ మేల్ చేయాల్సిన అవసరం లేదు…
తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి స్వరాష్ట్రం కోసం పోరాడిన సిసలైన ఉద్యమకారులమని అంతటి పోరాట పటిమ ఉన్న తాము ఎమ్మెల్యే ను బ్లాక్ మేల్ చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు.. విద్యార్టీ ఉద్యమమకారులు పేపర్ కు ఎక్కి తనను బ్లాక్ మేల్ చేస్తున్నారని ఎమ్మెల్యే తమపై ఆరోపణ చేసినట్లు తెలిసిందని ఈ వ్యాఖ్యలు సరికాదని ఉద్యమ కారులు అన్నారు. ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు… తెలంగాణ రాష్ట్రం కోసం తెగించి పోరాడిన తాము ఎమ్మెల్యే ను ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తామని వారు ప్రశ్నించారు. సాయం చేయమని కోరితే అసలు విషయాన్ని పక్కన పెట్టి ఎదురుదాడి ప్రారంభించడం ఎమ్మెల్యే కె దక్కిందని వారు అన్నారు. ఎన్నికల అవసరాలకు తమతో దీక్ష విరమింపజేసి, సాయం పక్కా అని మంత్రి కేటీఆర్ తో మాట ఇప్పించి మొండి చేయి చూపించి సాయం చేయనంటూ చెప్తున్న ఎమ్మెల్యే ది ఏ తరహా మోసమో ఆయనకే తెలియాలని ఉద్యమకారులు అన్నారు. కేటీఆర్ వద్దకు తీసుకువెళ్లి సాయం విషయంలో పూర్తి హామీ ఇచ్చింది ఎమ్మెల్యే కాదా…… అని ఉద్యమకారులు అంటున్నారు. ఇకనైనా ఎమ్మెల్యే ఇలాంటి మాటలు మాని తమకిచ్చిన హామీ తక్షణమే అమలు ఐయేలా చూడాలన్నారు.