మాట తప్పిన ‘ధర్మన్న’

పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి తీరుపై ధర్మారం,గొర్రెకుంట ఉద్యమకారుల ఆగ్రహం
కేటీఆర్ తీసుకురమ్మని చెప్పిన… పట్టింపులేని పరకాల ఎమ్మెల్యే
ఎన్నికలు ముగియగానే మాట తప్పారంటున్న ఉద్యమకారులు
ఎమ్మెల్యే ధర్మారెడ్డి ని ఎన్ని సార్లు కలిసిన మాట దాటవేశారు
కేటీఆర్ వద్దకు తీసుకువెళ్లేదే లేదని చెప్పారని ఉద్యమ కారుల ఆవేదన
ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందిస్తారా అంటు ప్రశ్నిస్తున్న ఉద్యమకారులు

పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి గొర్రెకుంట, ధర్మారం తెలంగాణ ఉద్యమకారులకు సాయం విషయంలో మాట తప్పారని ఉద్యమ కారులు అంటున్నారు. 2018 సాధారణ ఎన్నికల సమయంలో తనకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వ సాయం కోసం ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న తమను కేటీఆర్ చేత బుజ్జగించి స్వయంగా ఎమ్మెల్యే కేటీఆర్ వద్దకు తీసుకువెళ్లి ప్రస్తుతం మొహం చాటేశాడని వారు అంటున్నారు. ఎన్నికల్లో గెలవగానే తమ విషయం మరచి పోయాడని తెలంగాణ ఉద్యమ కారులు విజయ్, ప్రవీణ్,నవరత్నం, ప్రమోద్, గణేష్, సాగర్, సందీప్, శ్యామ్ లు ఆరోపించారు. కేటీఆర్ తమకు ఆర్థిక సాయం చేస్తారని తాము ఆశతో ఉన్న ఎమ్మెల్యే చొరవచూపకపోవడంతో తాము నిరాశలో ఉన్నామన్నారు.

మాట తప్పిన 'ధర్మన్న'- news10.app

మంత్రి కేటీఆర్ మాటిచ్చి రెండేళ్లు గడుస్తున్నా స్థానిక ఎమ్మెల్యే మాత్రం ఆ విషయాన్నే మరిచారని, తాము విషయాన్ని పలుమార్లు గుర్తు చేసిన పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెటిఆర్ తమకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ తమను కెటిఆర్ వద్దకు తీసుకువెళ్ళి సాయం చేయాలని ఎమ్మెల్యే ను ఇప్పటివరకు కనీసం యాభై సార్లు కలిసి ఉంటామని అయిన తమ పట్ల ఎమ్మెల్యే కనిసం సానుభూతి కూడా చూపలేదని వారు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఉద్యమం లో పాల్గొని ఆర్థికంగా చితికిపోయిన తమకు సాయం చేయాలని కోరితే తాను ఏమి చేయలేనని కేటీఆర్ వద్దకు సైతం తీసుకుపోనని ఎమ్మెల్యే ఓ సందర్భంలో అన్నట్లు వారు గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ కారులుగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి గెలుపుకోసం తాము అహర్నిశలు కష్టపడిన గుర్తింపు లేకుండా పోయిందన్నారు. మంత్రి కేటీఆర్ తమను తీసుకొని రమ్మని రెండు సంవత్సరాల క్రితం చెప్పిన ఇప్పటివరకు ఎమ్మెల్యే తీసుకుపోకపోవడంలో గల ఆంతర్యం ఏంటని ఉద్యమకారులు ప్రశ్నించారు. ఎన్నికలకోసం తమ దీక్షను విరమింపజేసి మాట తప్పడం కోసమే కంటి తుడుపు చర్యగా కేటీఆర్ తో హామీ ఇప్పించారా… ఎలాగూ ఎన్నికలో గెలిశారు గనుక తమను నిర్లక్ష్యం చేస్తున్నార… అని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కోసం చిత్తశుద్ధి తో ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల విషయంలో రాజకీయం చేయడం తగదన్నారు. ఇకనైనా ఎమ్మెల్యే ధర్మారెడ్డి తమ సమస్యను కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి హామీ నెరవేర్చేలా చేయాలని ఉద్యమకారులు మరోసారి ఎమ్మెల్యే కు విన్నవించుకుంటున్నారు. మాటతప్పకుండా ఉద్యమ కారులకు సాయం చేయాలని కోరారు.

జైలు బాధితులను గుర్తించాలి గట్టికొప్పుల శ్యామ్, ధర్మారం

మలిదశ ఉద్యమంలో ఇంట్లో నుండి కుటుంబ సభ్యులకు తెలియకుండా డబ్బులు తీసుకుని నిరాహారదీక్షలకు వంటా వార్పులకు ర్యాలీలకు ఖర్చుపెట్టుకున్నాం సంతోషంగా… చదువును సైతం నిర్లక్ష్యం చేసి ధర్నాలు రాస్తారోకోలు చేసినం రైలు రోకో చేస్తే ఆనాటి ప్రభుత్వం పి డి పి పి యాక్ట్ పెట్టి మా 8 మందిని జైలు కు పంపింది జైల్లో ఉన్న మమ్మల్ని ఆ నాటి వరంగల్ జిల్లా అధ్యక్షులు పెద్ది. సుదర్శన్ రెడ్డి, పరకాల నియోజకవర్గ ఇంచార్జ్ మొలుగురి భిక్షపతి ములాఖత్ పెట్టి మీకు భవిష్యత్ లో కే సి ఆర్, కే టి ఆర్ అండగా ఉంటారని చెప్పారు తెలంగాణ వచ్చింది సంబరాలు జరుపుకున్నాo ఎలాంటి సహకారాన్ని ఎవరు అందించలేదు విసిగిపోయిన మేము ఆమరణ నిరాహారదీక్ష కు కూర్చున్నాం పార్టీ పెద్దల హామీతో 3 రోజుల అనంతరం దీక్ష విరమించుకొని ఎమ్మెల్యే సమక్షంలో కే టి ఆర్ గారిని కలిసినం ఆ రోజు ఎమ్మెల్యే సాక్షిగా రామన్న తగు న్యాయం చేస్తానని అన్నారు ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజుల వ్యవధిలోనే వీళ్ళని తీసుకుని రా ధర్మన్న అని చెప్పారు దయచేసి ఎమ్మెల్యే గారు మమ్మల్ని కే టి ఆర్ వద్దకు తీసుకెళ్లి మాకు తగిన న్యాయం చేపియ్యాలని కోరుతున్నాం.

ఎమ్మెల్యే గారు స్పందించండి ల్యాదల్ల. ప్రవీణ్ గొర్రెకుంట

మేము ఉపాధి అవకాశాలు లేక ఆర్థికంగా చితికిపోయాము తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలు కు వెళ్ళినప్పుడు గర్వంగా ఉన్నాము కానీ ఇప్పుడు కుటుంబ సభ్యుల ముందు స్నేహితుల ముందు ఇతర పార్టీ నాయకుల ముందు తల దించుకుని బ్రతుకుతున్నాం ఎందుకంటే మాకు కే టి ఆర్ గారు హామీ ఇచ్చినప్పుడు సగర్వంగా సంతోషంగా మా ఉద్యమ సారథులు పార్టీ, ప్రభుత్వం తరపున సాయం చేస్తున్నారు అని సమాజంలో గొప్పగా చెప్పుకున్నాం తెలంగాణ వచ్చి 6 సంవత్సరాలు గడిచింది మాకు హామీ ఇచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది కుటుంబ సభ్యులతో పాటు ఇతర పార్టీల నాయకులు హేళన చేస్తున్నారు మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు అని దయచేసి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నాం మీ సాక్షిగా కే టి ఆర్ గారు మాటిచ్చారు మీరు మమ్మల్ని ఆయన వద్దకు తీసుకెళ్ళి మాకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నాం.

మమ్మల్ని కే టి ఆర్ వద్దకు తీసుకెళ్లాలి సిలివేరు. నవరత్నం గొర్రెకుంట

కే టి ఆర్ గారిని కలిసి రెండు సంవత్సరాలు గడిచింది ఆనాడు మా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సాక్షిగా మా8 మందికి ఆర్థిక సహకారంతోపాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పిస్తానని కే టిఆర్ మాట ఇచ్చారు ఆరోజు నుండి ఇప్పటివరకు మా ఎమ్మెల్యే గారు కే టి ఆర్ వద్దకు తీసుకెళ్లి తగిన న్యాయం చేస్తారని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నాం ఉద్యమంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాం, జైలు జీవితం గడిపినం కోర్టుల చుట్టూ తిరిగినం అయినా ఏనాడు భాధపడలేదు కానీ ఇప్పుడు బాధ అనిపిస్తుంది ఎందుకంటే మేము ఆర్థికంగా ఉపాధి పరంగా వెనుకబడ్డాం మాకు హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది అయినా మాకు ఇప్పటికీ న్యాయం జరగడం లేదు కే టి ఆర్ మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది దయచేసి ఇప్పటికయినా ఎమ్మెల్యే గారు స్పందించి మమ్మల్ని కే టి ఆర్ వద్దకు తీసుకెళ్లి మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాం.