డిసెంబర్ 1 న ద్రోహి ఇచ్చిన సమాచారంతో మావోయిస్టులను విషం పెట్టి అతి కిరాతకంగా చిత్రహింసలు పెట్టి చంపారని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఓ లేఖలో ఆరోపించారు… ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చల్పాక అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ పై ఆయన స్పందిస్తూ మీడియాకు లేఖ విడుదల చేసారు ..ముందుగానే పోలీసులకు అప్రూవర్ గా మారిన ఓ వ్యక్తి ద్వారా తినే అన్నం లో విషం కలిపించి,స్పృహ కోల్పోయేలా చేసి చిత్ర హింసలు పెట్టి దగ్గరనుంచి కాల్చి చంపారని జగన్ అన్నారు…
మావోయిస్టు అధికార ప్రతినిధి విడుదల చేసిన లేఖ యధాతధంగా….
డిసెంబర్ 9న బం…
భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ
పత్రికా ప్రకటన
5:05.12.202
ద్రోహి ఇచ్చిన సమాచారంతో డిసెంబర్ 1వ తేదీన ములుగు జిల్లా, ఏటూర్ నాగారం మండలం, చల్చాక గ్రామ పంచాయితీ అడవు పోల్ కమ్మ వాగు వద్ద తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు ఏడుగురి విప్లవకారులకు విషమిచ్చి అతి కిరాతంగా చంపారు. నవంబర్ 30వ సాయంత్రం ఏడుగురితో వున్న మా దళం చల్చాక పంచాయితీలో వున్న వలస ఆదివాసీ గ్రామాన్ని కలిసి నమ్మిన వ్యక్తికి తినడానికి భోజనాలు ఏర్పా చేయమని చెప్పారు. ముందుగానే పోలీసులకు అప్లోవర్ గా మారిన ఇన్ఫార్మర్ ద్వారా భోజనంలో విషం ఇచ్చి స్పృహం కోల్పోయే లాగా చేశా స్పృహ కోల్పోయిన కామ్రేడ్స్ ను పట్టుకుని చిత్రహింసలు పెట్టి తెల్లవారుఝామున 4 గంటలకు అతి సమీపం నుండి కాల్చి చంపారు. శతృవు వె పూరిత పథకంలో చిక్కి అమూల్యమైన కామ్రేడ్స్ కురుసం మంగు @ పాపన్న, బద్రు (తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు), ఏగోలపు మల్లు @(మధు, కోటి జెఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ సభ్యుడు), ముచాకీ అందాల్ @ కరుణాకర్ (ఇల్లెందు నర్సంపేట్ ఏరియా కమిటి సభ్యుడి ముచాకీ బూమే (@ జమున (ఏరియా కమిటీ సభ్యురాలు). పూనెం చోటు @కిశోర్( రీజినల్ కంపెనీ-2 మొదటి ప్లటూన్ పార్టీ కమిటి సభ్యుడై కర్ణం కామాల్ (రీజినల్ కంపెనీ-2లోని రెండవ ప్లటూన్ సభ్యుడు), కా. జైసింగ్ (ఏటూర్ నాగారం- మహదేవ్ పూర్ ఏరియా దళం సభ్యుడు. ప్రాణాలర్పించారు. ప్రజల కోసం ప్రాణాలర్పించిన అమరకులకు పేరు పేరున తెలంగాణ రాష్ట్ర కమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిన పాశవిక హత్యకాండను తీవ్రంగా ఖండిస్తూ డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్త బంద్ పిలుపునిస్తున్నది. యావత్ పీడత ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, విద్యాలయాలు, తదితర వ్యాపార సంస్థలు బందును పాటించి జయప్ర చేయాలని కోరుతున్నది. ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తి బాధ్యత వహించాలి. ఘటనపై న్యాయ విచారణ జ బాధ్యులైన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్పోరేట్లకు అత్యంత విశ్వాసంగా కొమ్ముకాస్తుంది. వారి లాఖ కోసమే దోపిడి విధానాలను అమలు చేస్తున్నది. అందులో భాగంగానే ప్రజా వ్యతిరేక విధానాలకు అడ్డంకిగా మారిన ప్రజా ఉద్యమాల అణిచివేయడానికి ప్రజా పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న మావోయిస్టు పార్టీని, పార్టీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ కగార్ కొనసాగిస్తున్నారు. దామెరతోగు, రఘునాథపాలెం, పోల్ కమ్మ వాగు వంటి వరుస ఎన్ కౌంటర్ల పేరుతో హత్యలకు పాల్పడుతున్నారు. కాం పార్టీ కొనసాగిస్తున్న ఈ పాశవిక దాడులను ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు తీవ్రంగా ఖండించాలని కోరుతున్నాము.
జగన్
అధికార ప్రతినిధి