ప్రభుత్వ భూమి ఫలహారం

అడవిరంగాపూర్ లో 34 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా
అక్రమంగా తిష్ట వేసిన వివిధ పార్టీల నాయకులు
భూమిని వదళాలని అధికారులు చెప్పిన వినరు
ప్రభుత్వ భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్న కొందరు
వెంకటాపూర్ మండలం అడవీరంగాపురం 28 సర్వే నెంబర్లో నాయకుల కబ్జా

వారు వివిధ రాజకీయపార్టీల్లో నాయకులుగా చెలామణి అవుతున్నవారు. నలుగురికి ఆదర్శగా ఉండాల్సిన వారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ఉన్నవారు. కానీ ఇవేమీ వారికి పట్టడం లేదు తమ స్వార్థం కోసం పనులుచేసుకుంటున్నారు. అక్రమంగా ప్రభుత్వభూమిలో పాగా వేసి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 34 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. రాజకీయ నాయకులు కావడంతో ఇదేంటని అధికారులు ప్రశ్నిస్తే వారినే బెదిరిస్తున్నారని తెలుస్తుంది. వివారాల్లోకివెళ్తే ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని అడవిరంగాపూర్ గ్రామంలోని 28 సర్వే నంబర్ లో గల 34 ఎకరాల ప్రభుత్వ భూమి ని కొందరు వ్యక్తులు కబ్జా చేశారని గ్రామస్తులు ఆరోపిస్తూన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వారు అక్రమంగా కబ్జా చేసి సాగు చేసుకుంటుంటే పట్టించుకునే నాథుడే కరువయ్యాడు అని తెలిపారు.

ప్రభుత్వ భూమి ఫలహారం- news10.app

అధికారుల అలసత్వం…?

34 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన అక్రమార్కులకు అధికారుల అలసత్వం లంచగొండితనం వారికి అందివచ్చిన వరంలా మారింది. దింతో కొంతమంది కబ్జా రాయుళ్లు ప్రభుత్వభూమిని అధికారులను మచ్చిక చేసుకొని అడ్డదారిన పట్టా చేసుకున్నట్లు తెలిసింది. వీరు చెప్పిందల్లా వింటూ కొందరు అవినతిపరులైన అధికారులు వారి నుండి కొంత మేర డబ్బు తీసుకొని ప్రభుత్వ భూమినీ అధికారుల స్వంత భూమిలా పట్టాలు ఇవ్వడం జరిగిందని స్థానికులు అంటున్నారు.. కబ్జా దారుల చేతికి ప్రభుత్వ భూమి చేరే సరికి ఊరి లోని పేదలకు వచ్చిన డబుల్ బెడ్ రూం లు, విద్యుత్ సబ్ స్టేషన్ , స్మశాన వాటిక మరియు ఇతర ఊరికి సంబంధించిన ఎటువంటి నిర్మాణాలు చేయడానికి అవకాశం లేక మంజూరు అయినయి తెరిగి వెళ్ళడం వల్ల ఊరిలోని ప్రజలు నష్ట పోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

కబ్జా దారులపై చర్యలు తీసుకోవాలి..

అడవీరంగాపూర్లో అక్రమంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించిన నాయకుల నుంచి భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఊరికి సంబంధించిన ఎదైన నిర్మాణాలు చేసుకోవాలి అంటే కబ్జా దారుల పై చర్యలు తీసుకొని వారి చేతికి వెళ్ళిన భూమిని అధికారులు స్పందించి తిరిగి తీసుకోవాలని వారు కోరుతున్నారు.

ప్రభుత్వ భూమి ఫలహారం- news10.app

కబ్జా నిజమే.. విఆరోఓ

అడవిరంగపుర్లో ప్రభుత్వ భూమి 34 ఎకరాలు అక్రమంగా కబ్జా ఐయింది నిజమేనని vro నాగరాజు అన్నారు. కబ్జా వి షయమై న్యూస్10 వివరణ కోరగా కబ్జా నిజమేనని తమ దృష్టికి వచ్చిందన్నారు. అడవిరంగపూర్ లోని 28 సర్వే నంబర్ లో గల భూమి నీ కబ్జా చేసుకుంది నిజమేననిపై అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.