మంత్రి సోదరుడి కుమారుడి తో ఎస్సై చెట్టాపట్టాల్…?

పోలీసు విధుల పట్ల పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న ఆ ఎస్సై రాజకీయ నేతల సేవలో మాత్రం బాధ్యత వ్యవహరిస్తూ వారితో విడిపోని స్నేహం ఏర్పరుచుకున్నట్లు తెలుస్తోంది.ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి అన్న కుమారుడితో ఏర్పడ్డ సాన్నిహిత్యమే విధుల పట్ల నిర్లక్ష్యం, ప్రజా సమస్యలంటే లెక్కలేనితం చూపేంత ధైర్యం తెచ్చిపెట్టిందా అన్న అనుమానం రాక మానదు.ఎస్సై విధులు నిర్వహిస్తున్న కాజీపేట సబ్ డివిజన్ కు చెందిన ఆ మండలానికి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి గా కొనసాగుతున్న సదరు యువనేతతో ఎస్సై చెట్టాపట్టాల్ వేసుకొని సామాన్యుల సమస్యలను గాలికి వదిలాడన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా తాజాగా జరిగిన ఆ యువ నేత బర్త్ డే వేడుకలకు ఎస్సై హాజరు అవ్వడమే కాకుండా అక్కడ ఆ కార్యక్రమానికి అంతా తనై వ్యవహరించినట్లు తెలుస్తోంది.రాత్రిపూట నిర్వహించిన ఆ వేడుకలో విందు,వినోదాల్లో ఆ పోలీసు అధికారే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నిలిచినట్లు సమాచారం……అంతేకాకుండా తన స్టేషన్లోని ఓ హెడ్ కానిస్టేబుల్ అన్ని ఫిర్యాదుల విషయంలో ముందుండి ఆ ఎస్సై కి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాడట.భూ సమస్యలు మొదలు చిన్నా చితక పంచాయితీలు సైతం వదలకుండా పెద్దమనుషులతో సెటిల్ చేసుకోండంటూ  పిర్యాదుదారులను  స్టేషన్ మెట్లు ఎక్కకుండానే తిప్పి పంపిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా అదే మండల పరిధిలోని ఓ గ్రామానికి చెంది ఓ బాధితుని భూవివాదంలో చంపుతామంటూ బెదిరించినప్పటికి ఎలాంటి కేసు నమోదు చేయకుండా స్టేషన్ చుట్టూ తిప్పుకొనే క్రమంలో ఎస్సై నిర్లక్ష్యం మూలంగా విసిగిపోయి రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి డీజీపీకి పిర్యాదు కూడా చేశాడు.అయినా సదరు పోలీసు అధికారి ప్రవర్తన లో ఎలాంటి మార్పు రాలేదని బాధితుడు ఆవేదన చెందుతున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా ఆ ఎస్సై తన స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో నేషనల్ హైవే పక్కనే 10 గుంటల భూమిని హెడ్ కానిస్టేబుల్ భాగస్వామ్యంతో కొనుగోలు చేసినట్లు స్టానికుల్లో చర్చ జోరుగా సాగుతోంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here