ఉత్తర తెలంగాణకే తలమానికంగా ఉన్న ఎంజిఎం పెద్దాసుపత్రిలో గంగాధర మాయ నడుస్తోందని ఆరోపణలు వస్తున్నాయి…ఈ ఆసుపత్రిలో డైట్ కాంట్రాక్టర్ గా చెలామణి అవుతూ తన హవాను కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది…మళ్ళీ డైట్ కాంట్రాక్టులు సమీపిస్తున్న నేపధ్యంలో అసలు డైట్ కాంట్రాక్టుకు గంగాధర్ కు సంబంధం ఏంటని చర్చ సాగుతోంది… అసలు డైట్ కాంట్రాక్టు తో గంగాధరకు సంబంధం లేకున్నా డైట్ కుసంబందించిన బిల్లులు అన్ని అతనెలా డ్రా చేస్తున్నాడనే విషయం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతుంది…అంతేకాదు అసలు డైట్ కాంట్రాక్టు ఎవరి పేరుపై ఉందని న్యూస్10 ఆరా తీస్తే ఆసక్తికరమైన విషయాలు బయటకువచ్చాయి… అసలు ఎంజిఎం లో డైట్ కాంట్రాక్టర్ ఎవరో తెలియని స్థితిలో ఎంజిఎం అధికారులు ఉన్నట్లు తెలియవచ్చింది… ఓ దశలో ఎంజిఎం డైట్ కాంట్రాక్టు విషయం ఆర్ టి ఐ ద్వారా అడిగితే అడిగిన పత్రాలు ఇవ్వకుండా ఎంజిఎం అధికారులు ఏవో కొన్ని పత్రాలు ఇచ్చి జతపరిచాం అని చెప్తు అసలు పత్రాలు ఇవ్వకుండా తప్పించుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది….ఒక్క ఎంజిఎం డైట్ కాంట్రాక్టర్ అంటే ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి…ఇదంతా బాగానే ఉన్నా అసలు డైట్ కాంట్రాక్టు తో సంబంధం లేని ఓ వ్యక్తి కాంట్రాక్టర్ గా చెలామణి అవుతూ నెలనెలా బిల్లులు డ్రా చేస్తున్నట్లు తెలుస్తోంది…ఇదంతా తెలిసిన అధికారులు చూసి చూడనట్లు గమ్మున ఉంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి…ఈ కాంట్రాక్టు ఆ వ్యక్తిదే ఐయితే అసలు రాహుల్ రాజ్,వై శ్రీనివాస్ ఎవరనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి…ఎంజిఎం లో ఇప్పుడున్న డైట్ కాంట్రాక్టర్ నిజమే ఐయితే అందుకు సంబంధించిన తప్పులతడక పత్రాలు ఎక్కడో తేడా కొట్టిందని ఇప్పుడు కాంట్రాక్టర్ గా చెలామణి అవుతున్న వ్యక్తి ఎవరి ప్రోత్సహంతోనో కాంట్రాక్టు దందా నడుపుతూ ఓ వ్యక్తి సినియార్టీని వాడుకుంటూ అందులో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని కొందరి అండదండలతో డైట్ కాంట్రాక్టర్ గా కొనసాగుతూ దండిగా సంపాదిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి….. దీనికి తోడుగా అసలు ఎంజీఎం డైట్ కాంట్రాక్టర్ ఎవరికి కనిపించక పోవడం ఎన్నో అనుమానాలు కలిగిస్తుంది….అంతే కాదు ఈ డైట్ కాంట్రాక్టు రహస్యాన్ని ఎంజీఎం అధికారులే తేల్చాల్సివుంది….
డైట్ కాంట్రాక్టర్ ఫర్మ్ రహస్యం…?
అంత తప్పుల తడక ఇవిగో ఆధారాలు…
ఇంతకీ ఆ శ్రీనివాస్ ఎవరు…సహకరిస్తున్న ఎంజిఎం అధికారులెవరు…?
మరో సంచికలో….