నగరంలోని డయాగ్నోస్టిక్స్ సెంటర్స్ దోపిడీకి కేంద్రాలుగా మారాయి…రోగుల అనారోగ్యం ఆసరాగా కాసుల వేట చేస్తూ అందినకాడికి దండుకొని భారీగానే వెనకేస్తున్నారు…వైద్య పరీక్షల కోసం వచ్చిన రోగుల వద్ద నుంచి స్కానింగ్,ఎక్స్ రే ,ఇతర పరీక్షల పేరుతో వేలల్లో వసూలు చేస్తూ…దోపిడీ దందా ను అడ్డగోలుగా కొనసాగిస్తున్నారు…ఈవసూళ్ల విషయంలో ఎవరిని అడగాలో,ఎవరు నియంత్రిస్తారో తెలియక సామాన్యులు అడిగినంత సమర్పించుకొని జేబులు ఖాళీ చేసుకుంటున్నారు…అసలే అనారోగ్యం డాక్టర్ చెప్పిన పరీక్షలు చేయకుంటే డాక్టర్ సాబ్ ఆసుపత్రి గడప కూడా తొక్కనివ్వరు…వైద్య పరీక్షల రిపోర్ట్ ఆధారంగానే మందులు రాస్తామని చెపుతారు…కనుక డయాగ్నోస్టిక్స్ సెంటర్స్ చెప్పిన చార్జీ చెల్లించి పరీక్షలు చేసుకొని రోగులు వెళ్లాల్సిన దుస్థితి…ధరల విషయంలో ఏమాత్రం మార్పు ఉండదు … అడిగింది చెల్లిస్తేనే వైద్య పరీక్షలు చేస్తారు… పీజు ఎంతో చెప్పే వారి నోటికి మొక్కాలి వారు చెప్పిందే పీజు …
దందా బట్టబయలు…
నగరంలోని డయాగ్నోస్టిక్స్ అడ్డగోలు దందా పొలిటికల్ వైబ్స్ ఛానల్ స్ట్రింగ్ ఆపరేషన్ లో మొత్తం బట్టబయలు ఐయింది…వైద్య పరీక్షల కోసం వెలితే కాస్త పీజు తగ్గించమని అడిగితే కిందా మీద చూసి కుదరదని కటువగా చెప్పి ఇష్టమైతే చేయించుకోండి లేదంటే వెళ్ళండి అని చెప్పే డయాగ్నోస్టిక్స్ పనికిమాలిన దందా బయట పడింది…ఊరు పేరు లేని ఆసుపత్రి పేరుతో ఫలానా డాక్టర్ రెఫర్ చేశారని చెపితే చాలు డాక్టర్ కమిషన్ గూర్చి,డయాగ్నోస్టిక్స్ కు మిగిలే దాని గూర్చి డయాగ్నోస్టిక్స్ ప్రతినిధులు పూసగుచ్చినట్లు చెబుతూ అడ్డంగా బుక్కైయ్యారు… ఫలానా స్కానింగ్ కావాలి అని అడిగితే ఐదు వేలు అవుతుందని చెప్పిన డయాగ్నోస్టిక్స్ ప్రతినిధులు అందులో డాక్టర్ కు కొందరు 3800 కమిషన్ అంటూ… ఇంకొందరు 3000 కమిషన్ అంటూ ఆఫర్ ల మీద ఆఫర్లు ఇచ్చారు….ఈ కమిషన్ ఎప్పుడు ఇస్తారు…?అని అడిగితే కొందరు నెల వారిగా అంటే,ఇంకొందరు వెంటనే ఫోన్ పే చేస్తామంటే ఇంకొందరు ఆసుపత్రికి నేరుగా వచ్చి నగదు పువ్వుల్లో పెట్టి అప్పగిస్తామని చెప్పారు…
అసలు కంటే కొసరు ఎక్కువ…
చిన్న జ్వరం తో వెళ్లిన టెస్టులు చేయించడం తప్పనిసరి అన్నట్లు కొందరు వైద్యులు మారిపోయారు…అవసరం ఉన్న లేకున్నా ఎడాపెడా టెస్టులు రాస్తూ రోగి జేబు గుల్ల చేస్తున్నారు…ఇదేదో రోగి ఆరోగ్యంగా ఉండాలనే సద్దుదేశంతో అనుకుంటే మనం నిజంగా తప్పులో కాలేసినట్లే ..కేవలం డయాగ్నోస్టిక్స్ సెంటర్స్ నుంచి వచ్చే కమిషన్ల కోసం ఇలా అనవసర టెస్టులు రాస్తున్నారని పొలిటికల్ వైబ్స్ ఛానల్ స్ట్రింగ్ ఆపరేషన్ ద్వారా స్పష్టం ఐయింది…కొన్ని డయాగ్నోస్టిక్స్ సెంటర్స్ డాక్టర్ల కు ఇచ్చే కమిషన్లు “అసలు కంటే కొసరు ఎక్కువ” అన్నట్లు ఉన్నాయి…స్కానింగ్ కు ఐదు వేల రూపాయలు చెప్పిన ఓ డయాగ్నోస్టిక్స్ సెంటర్ ప్రతినిది అందులో రెఫర్ చేసిన డాక్టర్ కు 3800 కమిషన్ అని చెప్పాడు… అంటే కేవలం స్కానింగ్ పీజు 1200అన్నట్లుకు వీటిలో రోగి వద్దనుంచి అదనంగా 3800 వసూలు చేసి డాక్టర్ ను డయాగ్నోస్టిక్స్ ప్రతినిధులు ప్రసన్నం చేసుకుంటున్నారన్నమాట…రోగి డాక్టర్ ను సంప్రదించిన ఖర్మానికి మనకు తెలియకుండానే మన జేబు నుంచి కమిషన్ పేరుతో 3800 లాగేసారన్నమాట….ఇలా కాసుల కోసం డాక్టర్లకు ఆఫర్స్ ఇస్తూ ఆ డబ్బులు రోగుల వద్ద నుంచి ముక్కు పిండి వసూలు చేస్తూ తమ దోపిడీ దందా ను డయాగ్నోస్టిక్స్ సెంటర్స్ యధేచ్చగా కొనసాగిస్తున్నాయి….హన్మకొండ నగరంలో ఉన్న రాడార్,సూర్య,స్టార్(కనెక్ట్) లాంటి డయాగ్నోస్టిక్స్ సెంటర్స్ ఈ దందా లో అగ్ర భాగాన నిలిచాయి…అంతేకాదు తాము గొప్ప అని చెప్పుకునే కొన్ని డయాగ్నోస్టిక్స్ సంస్థలు సైతం పి ఆర్ ఓ లను నియమించుకొని మరి కమిషన్ దందా కొనసాగిస్తున్నట్లు తెలిసింది…మీకింత మాకింత అనే ట్యాగ్ లైన్ తో రోగులను దోచుకుంటున్నట్లు తెలిసింది….
వామ్మో డయాగ్నోస్టిక్స్ సెంటర్లు…?
మరో సంచికలో