గురుకులాల్లో నాసిరకం సరుకుల సరఫరా విషయంలో కొందరు అధికారులు కాంట్రాక్టర్లకే వత్తాసు పలుకుతున్నట్లు కనపడుతోంది… ఇటీవల గురుకులాల్లో మళ్ళీ పాగా వేసిన కొందరు ప్రొవిజేన్స్ కాంట్రక్టర్లు నాసిరకం సరుకులు గురుకులాలకు సరఫరా చేస్తూ చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి…ఈ కాంట్రాక్టర్లే గత విద్యా సంవత్సరం కూడా నాసిరకం సరుకులే సరఫరా చేయగా వారిపై అప్పటి గురుకుల అధికారిణి ఏవిధమైన చర్యలు తీసుకోలేదు కాగా ఈ విధ్యా సంవత్సరం కూడా పాత కాంట్రాక్టర్లే టెండర్ దక్కించుకోగా వారు నాసిరకం సరుకుల బాటలోనే నడుస్తున్నారు..ఇవన్నీ ప్రశ్నిస్తే,నాసిరకం సరుకుల సరఫరా పై కథనాలు రాస్తే ఆ మేడం కు నచ్చడం లేదట…అలా ఎలా రాస్తారు…అంటూనే తాను మంత్రి మనిషినని తనను ఎవరేం చేయలేరని తనకుతానే గొప్పగా చెప్పుకుంటు మురిసి పోతుందట.. ఓ మంత్రి తనకు స్వయానా బందువని తోటి ఉద్యోగుల వద్ద “దొఖో మై పరపతి” అంటూ న్యూస్10 పై అవాకులు చెవాకులు పేలుతున్నట్లు తెలిసింది…
డి సి ఓ కు రుచించడం లేదు….?
గురుకులాల టెండర్లు దక్కించుకుని పాగా వేసిన పాత కాంట్రాక్టర్లు తమ ఇష్టారీతిన వ్యహరిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి….
ఈ నేపథ్యంలో కాంట్రక్టర్ల నాసిరకం దందా పై న్యూస్10 పలు కథనాలను వెలువరించింది …ఈ కథనాలు వెలువరించడం డి సి ఓ కు ఏమాత్రం నచ్చడం లేదట…ప్రొవిజన్స్ కాంట్రాక్టర్ల కు వత్తాసు పలికినట్లు మాట్లాడుతూ వారికి ధైర్య వచనాలు చెపుతూ నాసిరకం సరుకుల సరఫరాకు మద్దతు తెలిపినట్లే ఆ అధికారిణి మాట్లాడుతున్నట్లు తెలిసింది…గురుకులాల్లో నాసిరకం సరుకుల సరఫరా,న్యూస్10 కథనాలపై డి సి ఓ ఇతర అధికారులతో ,ఉద్యోగులతో మాట్లాడేప్పుడు న్యూస్10 తన ఇష్టారీతిన మాట్లాడుతున్నట్లు తెలిసింది…న్యూస్10 పై తన ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తూ..ఎం రాస్తారో రాసుకొని నా వెనకాల మంత్రి ఉంది అని గొప్పగా చెప్పుకోవడమే కాకుండా తాను మంత్రి మనిషిని అంటూ ఆ డి సి ఓ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలియవచ్చింది… నాసిరకం సరుకుల సరఫరా ను అడ్డుకొని విద్యార్థులకు నాణ్యమైన సరుకులతో మంచి భోజనం అందించే విధంగా పని చేయాల్సిన అధికారిణి నిజాలు రాసిన న్యూస్10 పైనే బెదిరింపు ధోరణిలో మాట్లాడుతూ… వారికి పిర్యాదు చేస్తా… వీరికి పిర్యాదు చేస్తా అంటూ ఉద్యోగుల వద్ద మాట్లాడుతున్నట్లు సమాచారం…
ఇంతకీ ఈ డి సి ఓ మేడం కు న్యూస్10 ఎందుకో ఈ అక్కసు. ..
ఆ మేడం అంతే….?
నాసిరకం సరుకులు సరఫరా అవుతున్న ఎందుకా నిర్లక్ష్యం…?
మరో సంచికలో…..