ఈ వెంచర్ యమ హాట్….

హాసన్ పర్తి మండలం ఎల్లాపూర్ లో 9 ఎకరాల్లో భారీ వెంచర్
కుడా అనుమతులు అసలే ఉండవు
అనుమతి పత్రాలు ఉన్నాయి తీసుకొస్తా… ఓపిక పట్టండి అంటున్న వెంచర్ యజమాని
కుడా అధికారులకు ఇంకా కనపడని అనధికార వెంచర్
తక్కువ ధరకే కేవలం సామాన్యులకు అమ్ముతున్న… అనుమతులతో పనేంటి అంటున్న యజమాని

ఈ వెంచర్ యమ హాట్....- news10.app

ప్రభుత్వం ఎన్ని నిబంధనలు పెట్టిన సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా నిబంధనలు రూపొందించిన వాటిని లెక్కచేయకుండా గండి కొట్టే వారే ఎక్కువగా ఉన్నారు. ఓ వైపు అధికారుల నిర్లక్ష్యం మరోవైపు వ్యాపారస్తుల లెక్కలేని తనం ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పడుతున్నాయి. ప్రస్తుతం రియల్ వ్యాపారంలో ప్రభుత్వ కళ్ళు గప్పి అక్రమంగా వ్యాపారం ఎలా చేయాలో వెంచర్ లు వేస్తున్న యజమానులకు బాగా అలవాటు అయిపోయింది. నగరం, నగర శివార్లలో వెంచర్ యజమానులు దాదాపు అధిక శాతం మంది అనుమతులు లేకుండానే అక్రమంగా వెంచర్లను నిర్వహిస్తున్నారు.

ఎల్లాపూర్ వెంచర్… అనుమతులు నిల్

హాసన్పర్తి మండలం ఎల్లాపూర్ వద్ద నిర్వహహిస్తున్న వెంచర్ ఎలాంటి అనుమతులు లేకుండానే వెంచర్ దర్జాను ఓలకబోస్తుంది. దాదాపు 9 ఏకరాల్లో నిర్వహిస్తున్న ఈ వెంచర్ నాల కన్వర్షన్ తో సరిపెట్టి కుడా అనుమతి లేకుండా రియల్ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. 9 ఎకరాల్లో ఇంత భారీగా వెంచర్ నిర్వహిస్తున్న కుడా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. అనుమతి లేక పోవడంతో కుడా కు నష్టమే ఐయిన అధికారులు మాత్రం తమకేం పట్టనట్లే వ్యవహరిస్తున్నారు.

ఈ వెంచర్ యమ హాట్....- news10.app

అనుమతి తెస్తాం….

ఎల్లాపూర్ వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్ నిర్వహిస్తున్న వెంచర్ యజమాని గణపతి రెడ్డిని న్యూస్10 వివరణ కోరగా అనుమతులు వస్తాయి అని చెప్తున్నారు. 9 ఎకరాల్లో వెంచర్ వేసి అమ్మకాలు ప్రారంభించి అనుమతులు తెస్తాం అంటు దాటవేసే ప్రయత్నం చేశారు. అనుమతులు వచ్చాయా … లేదా అని తిరిగి వివరణ కోసం ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదు.

ఈ వెంచర్ యమ హాట్....- news10.app

తక్కువ ధరే కదా…

మరోవైపు తమ వెంచర్లో ప్లాట్లను తక్కువ ధరకే విక్రహిస్తున్నామని దానికి అనుమతులు ఎందుకని వెంచర్ యజమాని సందేహాఁ వ్యక్తం చేశారు. తాను ఎక్కడ వెంచర్ వేసిన అనుమతులు లేకుండానే వ్యాపారం నడిపిస్తానని చెప్పకనే చెప్పారు. మరి ఈ 9 ఎకరాల వెంచర్ పై కూడా అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. వెంచర్ ను తొలగిస్తారా.. అనుమతులు లేకున్నా చేసుకోవచ్చని వదిలేస్తారా… చూడాలి.