కిలే(లా)డి టీచర్స్

పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన ప్రభుత్వ పంతులమ్మలు రియల్ ఎస్టేట్, చిట్ ఫండ్ మోసాలకు తెగబడుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి.ఓ వైపు ప్రభుత్వం నుండి జీతం పొందుతూనే మరోవైపు అదనపు ఆదాయం కోసం అక్రమ వ్యాపారం నిర్వహిస్తూ ప్రజలను నిండా ముంచుతున్నారని భాదితులు ఆవేదన చెందుతున్నారు. విద్యార్థులకు పాఠాలు చెప్పడం వారి వృత్తి అయినప్పటికీ రియల్ ఎస్టేట్, చిట్టీలు నడపడం వారి ప్రవృత్తి గా మార్చుకున్నారట. ఇంత వరకు బాగానే ఉంది కాని వారు చేసే వ్యాపారాలు సక్రమమైనవా అంటే వీటి విషయంలో కాస్త ఆలోచించాల్సిదే. అమాయకులే టార్గెట్ గా వారి చేత చిట్టీలు కట్టిస్తూ కాలపరిమితి పూర్తి అయినప్పటికీ వారికి డబ్బులు చెల్లించకుండా ముప్పుతిప్పలు పెడుతున్నరట.చిట్ ల పేరుతో వసూలు చేసిన సొమ్మును రియల్ ఎస్టేట్ లలో పెట్టుబడులు పెడుతూ
అడ్డగోలుగా సంపాదిస్తున్నారట.తాజాగా దామెర మండలంలోని ఓ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా ఉద్యోగిపై హసన్ పర్తి పొలీస్ స్టేషన్ లో 245/2024 ,420 ఐపీసీ సెక్షన్ 5/డబ్ల్యూ 76 చిట్ ఫండ్ యాక్ట్ 1982 అండ్ 5 ఆఫ్ టీ పీ డీ ఎఫ్ ఈ యాక్ట్ 1999 పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది . అంతే కాకుండా అరెపల్లి లోని 155,156,157 సర్వే నంబర్లు లోని 750 గజాల మూడు ప్లాట్ల భూమిని కొనుగోలు చేసిన ప్రభుత్వ పంతులమ్మలు 2020 కుడా మాస్టర్ ప్లాన్ లో కొంత భూమిని కోల్పోయమంటూ తిరిగి అమ్మకందారుని నుండి వారు చెల్లించిన మొత్తాన్ని వసూలు చేసి అట్టి భూమిని తిరిగి వారికి రిజిస్ట్రేషన్ చేయకుండా వేరే వారికి అమ్ముకొని అక్రమంగా సొమ్ము చేసుకున్న విషయంపై ఏనమాముల పోలీస్ స్టేషన్ లో ఫిబ్రవరి నెలలో 24/2024 పలు సెక్షన్ల కింద కేసులు నమోదయినట్లు సమాచారం.ఏనుమాముల లో గతంలో కాగా… లేడి టీచర్ల పై పోలీసులు గతంలో పలు మార్లు విచారణ జరపి కేసులు నమోదు చేసినప్పటికీ నేటికీ వారిపై చర్యలు శూన్యం .పైగా పోలీసులు బాధితులకు న్యాయం చేయకపోగా లేడీ టీచర్ల కే పరోక్షంగా సహకారం చేస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు..వేచి చూడాలి మరి ఇప్పటికైనా పోలీసులు బాధితులకు ఏ విధమైన న్యాయం చేస్తారో మరి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here