పాత దందా మారలే….?

గురుకులాల్లో పాత దందా ఏమాత్రం మారలేదు ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా పాగా వేసి పాతుకుపోయిన కొందరు కాంట్రాక్టర్లు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి… గతంలో ఈ కాంట్రాక్టర్ లపై విపరీతమైన ఆరోపణలు వచ్చిన అప్పటి అధికారులు ఏమాత్రం స్పందించకుండా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తమను ఏ అధికారి వచ్చిన ఎం చేయలేరనే ధీమాలో ఉన్నట్లు తెలిసింది… అంతేకాదు తమపై ఎవరైనా ఆరోపణలు చేసిన,తాము నాసిరకం సరుకులు సరఫరా చేస్తున్నారని పిర్యాదు చేసిన ఆరోపణలు చేసిన వారికి,పిర్యాదు చేసిన వారికి ఎదో ఆపాదించి వారిపై తప్పుడు ప్రచారం చేసేందుకు ఈ కాంట్రాక్టర్లు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదని తెలుస్తోంది…తాము ఆడింది ఆటగా పాడింది పాటగా గురుకులాల్లో తమ ఇష్టారీతిన వ్యవహరిస్తున్న వీరు అధికారులు సైతం తాము చెప్పినట్లే వింటారని ప్రచారం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది….

కొత్త టెండర్లు ….పాత కాంట్రాక్టర్లు

సాంఘీక సంక్షేమ శాఖ,ఎం జె పి,కె జి బి వి,మైనార్టీ గురుకులాల్లో మళ్ళీ పాత కాంట్రాక్టర్లే పాగా వేశారు… అసలు ఆ రహస్యం ఏంటో తెలియదు కాని ప్రతి ఏటా ప్రొవిజేన్స్ లో ఈ కాంట్రాక్టర్లకే టెండర్ దక్కుతుంది…టెండర్ అంటే ఒకటో రెండో కాదు ఏకంగా ఒక్కో కాంట్రాక్టర్ ఒకటి కి మించి అన్ని గురుకులాల్లో టెండర్ దక్కించుకుని తమ నాసిరకం దందాను అడ్డు అదుపు లేకుండా కొనసాగిస్తున్నారని తెలిసింది….ప్రొవిజేన్స్ లో తాము ఆరితేరిపోయామని అనుకుంటున్న… ఇ సోమశేఖరం ఎంటర్ ప్రైజెస్,అజీమ్ ఎంటర్ ప్రైజెస్,కనకదుర్గ ఎంటర్ ప్రైజెస్,వివన్ ట్రేడర్స్,మదిన ట్రేడర్స్,మనికాంత ఏజెన్సిస్,లకు చెందిన కాంట్రక్టర్లు నాసిరకం సరుకుల సరఫరా చేస్తున్నట్లు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి… ఇంతటి విమర్శలు వస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా గతంలో ఉన్న అధికారులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గతంలో ఆరోపణలు ఉన్నాయి….దింతో వీరు తమను అనేవారు లేరనే ధీమాలో వారికి తోచినట్లు నాసిరకం సరుకులు సరఫరా చేసి తోచినట్లు వ్యవహరించినట్లు తెలుస్తుంది…మొన్నటికి మొన్న వరంగల్ లో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న ఓ కాంట్రాక్టర్ నాసిరకం సరుకులు గురుకులాలకు సరఫరా చేసి చేతులు దులుపుకున్నట్లు విశ్వసనీయ సమాచారం…కాగా నాసిరకం సరుకులు సరఫరా చేయడమే కాకుండా ఆరోపణలు వస్తే తమకు సంబంధించినది కాదు వేరే కాంట్రాక్టర్లది అంటూ ప్రచారం చేయడం వీరికి అలవాటుగా మారినట్లు సమాచారం…ప్రొవిజన్స్ కాంట్రాక్టులో తాము పాతుకుపోయాం తమను కాదని ఎవరికి ప్రొవిజన్స్ కాంట్రాక్టు రాదని మాటలు చెప్పే ఈ కాంట్రాక్టర్లు కందిపప్పు, ఉల్లిగడ్డ,అల్లం,వెల్లుల్లి, చింతపండు,కారం,పసుపు, సరఫరాలో తమ ఇష్టం వచ్చినట్లు అవినీతికి పాల్పడుతూ కేవలం నాసిరకం సరుకులే సరఫరా చేస్తున్నట్లు తెలిసింది….

కొందరు ప్రిన్సిపాల్స్ సహకారం….?


గురుకులాల్లో ప్రొవిజేన్స్ సరఫరా చేస్తున్న కాంట్రక్టర్లకు కొందరు ప్రిన్సిపాల్స్ తమ శాయశక్తులా సహకరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి…నాసిరకం సరుకులు సరఫరా చేస్తున్న ప్రొవిజేన్స్ కాంట్రాక్టర్లు గురుకులాల్లోని కొందరు ప్రిన్సిపాల్స్ తో కుమ్మక్కైనట్లు ఆరోపణలు బాగానే ఉన్నాయి….ఈ నేపద్యంలో వారు నాసిరకం సరుకులు సరఫరా చేసినట్లు కళ్ళు మూసుకొని ఒకే చెపుతున్నట్లు తెలుస్తుంది…ప్రిన్సిపాల్స్ సహకారం ఉంటే చాలు తాము దందా ను ఇలాగే నడపొచ్చనే ధీమాలో ఆ కాంట్రాక్టర్లు ఉన్నట్లు సమాచారం…

నాసిరకం సరుకుల కథ కమామిషు…

కళ్ళు మూసుకుందేవరు….?

మరో సంచికలో….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here