మొన్నటివరకు అక్రమ ఇన్స్యూరెన్స్ దందాలో దూసుకుపోయి తమను ప్రశ్నించే వారే లేరని అనుకున్న గురు శిష్యులకు ఇప్పుడు ఎటుపాలుపోని పరిస్థితి ఏర్పడింది… అక్రమ ఇన్స్యూరెన్స్ దందాపై న్యూస్10 వరుస కథనాలు వెలువరిస్తుండడంతో ఆ ఇద్దరు గురు శిష్యులు ఇప్పుడు గప్ చుప్ ఐయ్యారు…పేద ప్రజల అమాయకత్వాన్ని ,అవసరాన్ని ఆసరాగా చేసుకుని అక్రమ ఇన్స్యూరెన్స్ లతో బాగానే వెనకేసిన ఈ గురు శిష్యులు ఎవరికి వారే ఇప్పుడు విడిపోయి జనాన్ని తమ అక్రమ ఇన్స్యూరెన్స్ దందాతో మోసం చేయడంలో పోటీ పడుతున్నట్లు తెలిసింది తాను టాస్క్ పోర్స్ కు చిక్కిన నాటి నుంచి దందాకు పూర్తిగా స్వస్తి పలికానని తన సన్నిహితుల వద్ద చెపుతున్న రాముడు తన అక్రమ దందాలో శ్రీకాంతుడు దూరమైయిన లేదు లేదు అంటూనే యమ స్పీడు తో దూసుకుపోతున్నట్లు తెలియవచ్చింది …వారి సొంత గ్రామం తో సహా వరంగల్ ఉమ్మడి జిల్లాలో మరికొన్ని ప్రాంతాల్లో వీరు తమ అక్రమ ఇన్స్యూరెన్స్ దందా ను యధేచ్చగా నడుపుతున్నట్లు సమాచారం…వీరి భాదితులు వరంగల్ ఉమ్మడి జిల్లాలో బాగానే ఉన్నట్లు తెలుస్తోంది …..కాగా గురువును వదిలి తాను సొంతగా ఓ ముఠాను ఏర్పాటు చేసి అక్రమ ఇన్స్యూరెన్స్ దందా సాగిస్తున్న శ్రీకాంతుడు ఎం చేసిన తనకేం కాదని ధీమాలో ఉంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నట్లు తెలిసింది… గురువును మించిన శిష్యుడిలా ఉన్న ఇతగాడు ఇన్స్యూరెన్స్ అక్రమ దందాలో గురువు కంటే ముందుగా జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నట్లు తెలుస్తుంది…కాగా ఈ గురు శిష్యుల అక్రమ ఇన్స్యూరెన్స్ దందా పై టాస్క్ పోర్స్ పోలీసులు మరోసారి తీగ లాగితే డొంక కదలడం ఖాయమని పలువురు అంటున్నారు….
దందాకు సహకరిస్తుందెవరు….?
న్యూస్10 విశ్వసనీయ కథనం…
మరో సంచికలో