వరంగల్ జిల్లాలో అక్రమ ఇన్స్యూరెన్స్ లల్లో తొడుదొంగల హవా నడుస్తోంది…మొన్నటివరకు జోడి బ్రదర్స్ లా తిరిగిన ఆ ఇద్దరు ఇప్పుడు విడిపోయి ఎవరి అక్రమ దందా వారే జోరుగా సాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి…వీరిద్దరూ ఎవరికి వారే ప్రత్యేకంగా ముఠాలను ఏర్పరచుకొని అమాయకుల పేర ఇన్స్యూరెన్స్ లు చేపించి వారి కుటుంబ సభ్యుల ద్వారా బలవంతంగా ఒప్పందాలు చేయించుకొని వాటికి సంబంధించిన ఆధారాలు అన్ని వారి గుప్పిట్లో ఉంచుకొని ఇన్స్యూరెన్స్ అక్రమ దందాను ఎలాంటి అడ్డు అదుపు లేకుండా నడిపిస్తున్నట్లు తెలుస్తుంది….ఈ ఇద్దరు తోడు దొంగల్లో అమాయకులను మోసం చేయడంలో ఎవరికి వారే సాటి అనితెలుస్తుంది….వీరిద్దరిలో ఒకరు గురువు అయితే ఇంకొకరు శిష్యుడు అట…. వీరిద్దరూ ఇటీవలే విడిపోగా నీవు నేర్పిన విద్యయే నీరాజాక్ష అంటూ శిష్యుడు గురువును మించి పోయి అక్రమ ఇన్స్యూరెన్స్ దందాను జెట్ స్పీడ్ తో నడిపిస్తున్నట్లు తెలుస్తుంది….ఇక గురువు గతంలో టాస్క్ ఫోర్స్ కు చిక్కిన అదేం పట్టనట్లు తనకున్న పూర్వ అనుభవంతో అక్రమ ఇన్స్యూరెన్స్ దందా ను నడుపుతున్న ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న నాకేం తెలియదు అంటూ సత్యపు మాటలు మాట్లాడుతూనే గుట్టుచప్పుడు కాకుండా దందా నడుపుతున్నట్లు తెలుస్తుంది…ఈ అక్రమ ఇన్స్యూరెన్స్ దందాలో బాగా ఆరితేరిన “రాము”డు భాదితులు అతగాడి సొంత గ్రామంలో సైతం ఉన్నట్లు తెలియవచ్చింది…..
కాదు కాదు అంటూనే యమ స్పీడు
అక్రమ దందాలో దూసుకుపోతున్న గురు శిష్యులు
తనను ఎవరేం చేయలేరంటున్న “శ్రీకాంతు”డు
మరో సంచికలో