ఉన్నత స్థాయి ప్రమాణాలు కలిగిన విద్యా బోధన, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం, విశాలమైన భవనాలు ,ఆల్ ఇండియా స్థాయి ర్యాంకులు సాధించడంలో మాకు మేమే సాటి మాకు ఎవరూ లేరు పోటీ అంటూ వరంగల్,హన్మకొండ నగరాల్లోని ప్రయివేటు ఇంటర్మీడియట్ విద్యాసంస్థలు ఊదర కొడుతున్నాయి.. విద్యార్థుల తల్లిదండ్రులను ఆకట్టుకునేలా ఆకర్షవంతమైన ప్రకటనలతో విద్యార్థులను వారి తల్లిదండ్రులను బురిడీ కొట్టించి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ వారిని నిలువు దోపిడీ చేస్తున్నాయి. నగరంలో విద్యార్థుల తల్లిదండ్రులను అధిక ఫీజులతో ఆర్థికంగా కుంగదీసే కార్పొరేట్ కళాశాలల మాఫియా రోజురోజుకు బరితెగిస్తుంది. విద్యాశాఖ నిబంధనలను తుంగలో తొక్కి ఇంటర్ విద్యాశాఖ అధికారులకే దేకో మై దందా అంటూ సవాల్ విసురుతుంది. హన్మకొండ,వరంగల్ జిల్లాలో ప్రైవేటు కళాశాలలో దోపిడీని భరించలేని విద్యార్థుల తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఆర్థికంగా వెనుకకు నెట్టివేయబడుతూ తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. నగరంలో కొన్ని కళాశాలలు సేవ ముసుగులో కార్పొరేట్ శక్తులుగా మారి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఐఐటి ,నీట్ ,జేఈఈ కోచింగ్ లంటూ స్పెషల్ బ్రాంచ్ ల పేరుతో డే స్కాలర్స్,రెసిడెన్షియల్ అంటూ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తు కళాశాలల యజమానులు కోట్లకు పడగెత్తుతున్నారు. విద్యార్థుల సొమ్ముతో విలాసవంతమైన జీవితాలు అనుభవిస్తున్న సదరు కళాశాలల యజమానులు సేవ అనే పేరును అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదిస్తున్నారు.సరిగ్గా ఇదే కోవాకు చెందింది వరంగల్ నగరంలో ని ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల పేరుకే కార్పొరేట్ కాలేజీ కానీ విద్యాశాఖ నిబంధనలు ఏమాత్రం పట్టించుకోదు.అనుమతి లేకుండానే వరంగల్ పోచమ్మ మైదాన్ లో ఓ కళాశాలను ఏర్పాటు చేసి విద్యార్థుల తల్లిదండ్రులను బురిడీ కొట్టించి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తుంది. భవన నిర్మాణం పూర్తికాకముందే బహుళ అంతస్తుల్లో కళాశాల నిర్వహిస్తూ విద్యా వ్యాపారాన్ని మొదలుపెట్టింది. అంతేకాకుండా 39230 కళాశాల కోడ్ తో 15-106/ 2 ఇంటి నెంబర్ కలిగిన వర్ధన్నపేటలోని ఆల్ఫోర్స్ కళాశాల పేరుతో వరంగల్ పోచమ్మ మైదాన్ లోని ఓ అద్దె భవనానికి బోర్డు తగిలించి విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేసి అడ్డగోలుగా అడ్మిషన్లు చేసింది.అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికాగానే బోర్డును తొలగించి తరగతులను ప్రారంభించింది.సదరు కళాశాలకు ఎలాంటి అనుమతులు లేనప్పటికీ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడరు. అనేకమంది విద్యార్థి సంఘాల నేతలు ఫిర్యాదులు చేసినప్పటికీ వరంగల్ డి ఐ ఈ ఓ మాధవరావు చర్యలకు సిద్ధపడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.ప్రభుత్వ జీతం తీసుకుంటూ ఉన్నత హోదాలో కొనసాగుతూ ప్రభుత్వ కళాశాలలను ప్రోత్సహించి ప్రైవేటు కార్పొరేట్ కళాశాలల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన విద్యాశాఖ అధికారులు కార్పొరేట్ కళాశాలల యజమాన్యాలకు కొమ్ము కాయడం