రోహిణి ఇదేం దందా….?

కాలం చెల్లిన మందులతో ఆ ఆసుపత్రి రోగులతో చెలగాటం ఆడుతుంది…. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారికి నిరక్ష్యరాసులకు కాలం చెందిన మందులు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు….ఇదేంటి అని ప్రశ్నించినవారికి ఏవో మాయమాటలు చెప్పి చేసిన తప్పును సరి దిద్దుకునేది పోయి అదే పనికిమాలిన దందాను కొనసాగిస్తూ కాసుల వేట లో బరితెగిస్తున్నారు…కాగా గత కొన్ని సంవత్సరాలుగా ఈ కాలం చెల్లిన మందుల దందా ఈ ఆసుపత్రిలో అడ్డుఅదుపు లేకుండా యధేచ్చగా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది…లక్షల రూపాయలు కాలం చెల్లిన మందులు ఆసుపత్రి సెల్లార్ లో ,ఇతర గదుల్లో ఉన్నాయట…అంటే ఇన్ని రోజులుగా కాలం చెల్లిన మందులతో ఆస్పత్రి యాజమాన్యం రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడిందని స్పష్టం అవుతోంది….

గుట్టు వీడింది ఇలా….

హన్మకొండలోని రోహిణి ఆసుపత్రిలో గత కొన్ని నెలలుగా కాలం చెల్లిన మందులు రోగులకు అంటగడుతున్నట్లు ఫార్మాసిస్టు సంక్షేమ సంఘానికి కొందరు బాధితుల ద్వారా సమాచారం అందడంతో రోహిణి ఆసుపత్రి కాలం చెల్లిన మందుల దందా బయటపడింది…సంఘానికి చెందిన కొందరు ఫార్మసిస్టులు రోహిణి ఆసుపత్రికి వెళ్లి ఓ ప్రిస్క్రిప్షన్ ద్వారా ఓ రోగిని పంపించి మందులు కొనుగోలు చేయగా కాలం చెల్లిన మందులు అందించారు….దింతో మందులను చెక్ చేసిన ఫార్మసిస్టులు సంక్షేమ సంఘం
అవి కాలం చెల్లిన మందులుగా గుర్తించారు.. దింతో ఫార్మసిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బత్తిని సత్యనారాయణ గౌడ్ రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అధికారులకు సమాచారం ఇచ్చారు…రంగంలోకి దిగిన డ్రగ్ కంట్రోల్ అధికారులు హన్మకొండ జిల్లా అధికారులకు సమాచారం అందించి రోహిణి ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించారు…. ఈ తనిఖీల్లో రోహిణి ఫార్మసీలో కాలం చెల్లిన మందులు ఉన్నట్లుగా గుర్తించారు….

స్థానిక డి ఐ వెనకడుగు….?

తనిఖీల సమయంలో హన్మకొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ కాలం చెల్లిన మందులు ఉన్న లేవన్నట్లుగా చిత్రికరించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది….ఈ విషయాన్ని గుర్తించిన ఫార్మాసిస్టుల సంఘం తిరిగి పై అధికారులకు ఫిర్యాదు చేయగా సంఘం ఫార్మాసిస్టులను ఫార్మసీలో కాలం చెల్లిన మందులను మీరే గుర్తించండని చెప్పగా వారు ఆ మందులను గుర్తించి అధికారులకు అప్పగించారు… ఈ కాలం చెల్లిన మందులు ఒక్క ఫార్మసీలోనే కాకుండా ఆస్పత్రి సెల్లార్ లో ఇతర గదుల్లో ఉన్నట్లు ఆసుపత్రి సిబ్బందే గుర్తించిన కొద్దీ అవి బయట పడుతున్నట్లు తెలిసింది….

కఠిన చర్యలు తీసుకోవాలి…

ఫార్మాసిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బత్తిని సత్యనారాయణ గౌడ్….

కాలం చెల్లిన మందులను రోగులకు అంటగడుతున్న రోహిణి ఆసుపత్రి యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలనిఫార్మాసిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బత్తిని సత్యనారాయణ గౌడ్ డిమాండ్ చేశారు… రోగులకు కాలం చెల్లిన మందులు అంటగడుతూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆయన ఆరోపించారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here