టౌన్ ప్లానింగ్ మరో లీల…?

వడ్డించే వాడు మనవాడైతే ….అన్నట్లు మారింది వరంగల్ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారుల తీరు అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి…ఈ విభాగం అధికారులు వ్యవహరిస్తున్న తీరు వల్ల భూమికి చెందిన అసలు దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్లు తెలుస్తుంది…టౌన్ ప్లానింగ్ విభాగంలో కొంతమంది అధికారులు అక్రమార్కులకు వంత పాడుతూ నిర్మాణాలకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి…నిర్మాణం అనుమతుల పేరుతో కొందరు అక్రమార్కులు అవే అనుమతుల పేపర్లను భూమికి చెందిన కాగితాలుగా చూపిస్తూ మాయ చేసి అక్రమ నిర్మాణాలు చేసిన అనేక ఉదంతాలు గ్రేటర్ వరంగల్ నగరంలో వెలుగులోకి వచ్చాయి…ఇలాంటి నిర్మాణల విషయంలో పిర్యాదు వస్తే నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొనే టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్మాణాలు అక్రమం అని చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేసిన పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి… హన్మకొండ నగరంలోని గుండ్ల సింగారం లోని సర్వే నంబర్ 1/1 లో భూమి తనది కాకున్న నిర్మాణం చేస్తున్నాడని భాదితులు పిర్యాదు చేస్తే ఉన్నతాధికారులు ఆ నిర్మాణాన్ని తొలగించాలని ఆదేశాలు ఇచ్చిన కనీసం ఒక్క అడుగు కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు ముందుకు వేయలేదని తెలుస్తుంది….భాదితుడికి వ్యతిరేకంగా ఉన్నతాధికారులకు నివేదికలు పంపడంలో చూపిన శ్రద్ద నిర్మాణం అక్రమం అని చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకపోవడంలో ఉన్న మతలబు ఏంటని భాదితులు ప్రశ్నిస్తున్నారు……

టౌన్ ప్లానింగ్ మరో లీల….

హన్మకొండ నగరంలోని గుండ్ల సింగారంలోని 1/A సర్వే నంబర్ లో ఇంటి నిర్మాణానికి అక్రమంగా అనుమతులు ఇచ్చి టౌన్ ప్లానింగ్ అధికారులు మరో లీలకు తెర తీసినట్లు తెలిసింది …ఈ ప్రాంతంలో ఈ సర్వే నంబర్ అసలు లేకున్నా ఉన్న సర్వే నంబర్ 1 కి బై A చేర్చి నకిలీ పాస్ బుక్ సృష్టించి ఓ వ్యక్తి కబ్జా కు యత్నించినట్లు విశ్వసనీయంగా తెలిసింది….ఈ కబ్జా వ్యవహారంపై అసలు పట్టాదారులు కోర్టు ను ఆశ్రయించగా అప్పటి జాయింట్ కలెక్టర్ నకిలీ పాస్ బుక్ లను రద్దు చెసినట్లు తెలిసింది….ఇవేమీ గుర్తించకుండానే 1/A పేరుతో ఉన్న భూమి పత్రాలను ఆసరాగా చేసుకుని టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతి ఇచ్చినట్లు తెలిసింది…. సర్వే నంబర్ 1/1లో ఇప్పటికే అక్రమనిర్మాణం చేస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి
ఈ అనుమతులను ఆసరాగా చేసుకుని వేరే వ్యక్తుల పేరుపై అనుమతి తీసుకుని నిర్మాణం కోసం వెళితే అక్కడ ఉన్న పట్టాదారులు అడ్డుకోవడంతో పలాయనం చిత్తగించినట్లు తెలిసింది…ఇలా ఇక్కడ ఉన్న సర్వే నంబర్ 1/1 లో టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతులు ఇవ్వడంతో అసలు దారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది….1/1 సర్వే నంబర్ లో అక్రమ నిర్మాణం పై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చిన ఇప్పటికి ఆ ఆదేశాలను పాటించకపోవడం ,అక్రమ నిర్మాణం చేస్తున్న వారికి కనీసం నోటీసులు ఇవ్వకపోవడం ఎందుకో టౌన్ ప్లానింగ్ అధికారులకే తెలియాలి…మరోవైపు సర్వే నంబర్1/A పేరుతో నకిలీ పాస్ బుక్ సృష్టిస్తే దానిని రద్దు చేసిన వాటినే ఆధారం చేసుకుని ఇంటి నిర్మాణం కోసం టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారో చెప్పాలని భాదితులు ప్రశ్నిస్తున్నారు…మరి ఈ రెండు విషయాల్లో వరంగల్ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here