శాయంపేట మండల కేంద్రంలో గంజాయి కలకలం కలిగిస్తోంది శాయంపేట మండల కేంద్రంలోని తాళ్లకుంట ప్రాంతంలో గత రెండు రోజులుగా టాస్క్ ఫోర్స్,ఆత్మకూరు పోలీసులు దాడులు నిర్వహించి గంజాయితోపాటు శాయంపేట గ్రామానికి చెందిన ఒక యువకుడిని తీసుకొని రిమాండ్ చేసినట్లు సమాచారం.అయితే ఆత్మకూరు మండలం గూడేప్పాడు వద్ద పోలీసులు ద్విచక్ర వాహనాలను తనిఖీ చేస్తుండగా గంజాయి సేవిస్తూ, విక్రయిస్తూ ఇద్దరు యువకులతో పాటు శాయంపేట గ్రామానికి చెందిన ఓ యువకుడితో సహా మొత్తం ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
ఏ నోట విన్న గంజాయి చర్చ…
శాయంపేట మండల కేంద్రంలో ఏ నోట విన్న గంజాయి చర్చ జరుగుతుంది…గంజాయి మూలాలు శాయంపేట మండల కేంద్రంలో ఉన్నట్లు పలు అనుమానాలకు కలుగుతున్నాయి.గత కొన్నేళ్లుగా పలు రాజకీయ పార్టీలకు చెందిన కొంతమంది నాయకుల అండదండలతో మండల కేంద్రంలో యువకులు గంజాయి సేవిస్తూ విక్రయిస్తున్నారని, అయితే పోలీసులు బడా బాబులను వదిలి పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అన్న చందంగా వ్యవహరిస్తున్నారని మండల కేంద్రంలో జోరుగా చర్చ కొనసాగుతుంది….
గంజాయి వెనుక బడబాబులు….?
వెన్నుతట్టి ప్రోత్సహించేది వారేనా….?
గంజాయి వెనక రాజకీయ నాయకులు….?
ఉష్ గప్ చుప్…..
శాయంపేట గంజాయి గుట్టు…
రేపటి న్యూస్10 సాయంత్రం సంచికలో