వార్తలు వస్తే ఏమవుతుంది …?అనే బరితెగింపుతనం కావచ్చు…తాము ఏంచేసిన కలెక్టర్ తో సహా ఏ ఉన్నతాధికారి తమను ఏంచేయడనే ధైర్యం కావచ్చు ఆ గురుకులాల అధికారి తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి…పేరుకే టెండర్లు కానీ ఆ టెండర్లు పాత వారికే మళ్ళీ మళ్ళీ దక్కేలా చేయడమే అధికారి ప్రత్యేకత లాగా కనపడుతుంది…అవును గురుకులాల్లో నాసిరకం వస్తువులు సరఫరా చేస్తూ అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంట్రాక్టార్లకు మళ్ళీ అదే గురుకులాల్లో ఆ అధికారి కాంట్రాక్ట్ కట్టబెట్టినట్లు తెలుస్తుంది…గత కొన్ని సంవత్సరాలుగా టెండర్ దక్కించుకుంటూ సర్కార్ సొమ్ము అడ్డగోలుగా మెక్కుతున్నవారికే ఆ గురుకులాల అధికారి మళ్ళీ ప్రాధాన్యత ఇచ్చి కాంట్రాక్టును తిరిగి వారికే పువ్వుల్లో పెట్టి అప్పగించేందుకు సిద్ధం ఐయినట్లు తెలుస్తుంది…
వాట్సాప్ కాల్ మంతనాలు….?
గత కొన్ని సంవత్సరాలుగా గురుకులాల్లో కాంట్రాక్టర్లకుగా కొనసాగుతున్న కాంట్రాక్టర్లకే మళ్ళీ కాంట్రాక్ట్ కట్టబెట్టడానికి ఆ ఆర్ సి ఓ తెగ ఉత్సహాన్ని చూపుతూ గత రాత్రి తొమ్మిది గంటల తర్వాత వాట్సాప్ కాల్ లో మంతనాలు జరిపినట్లు విశ్వసనీయంగా తెలిసింది….గురుకులాల్లో పాతుకుపోయి సర్కార్ ఖజానాకు భారీ గండి కొడుతున్న ఆ బడా కాంట్రాక్టర్లతో ఆ ఆర్ సి ఓ మేడం రెండుగంటలకు పైగా ఒక్కొకరిని వాట్సాప్ లైన్ లోకి తీసుకొని మాట్లాడినట్లు తెలిసింది…పాత కాంట్రాక్టార్లకు నిబంధనలు తుంగలో తొక్కి మళ్ళీ కాంట్రాక్ట్ కట్టబెడతా అని చెప్పి తనను ఎలా ప్రసన్నం చేసుకోవాలో ఇతర గురుకులాల ఉద్యోగులను సైతం ఎలా దారికి తెచ్చుకోవాలో ఈ వాట్సాప్ సంప్రదింపుల్లో ఆర్ సి ఓ మేడం పూసగుచ్చినట్లు వివరించినట్లు తెలియవచ్చింది…అంతేకాదు తాను వాట్సాప్ కాల్ లో రహస్య మంతనాలు జరిపిందే కాకుండా ఇతర ఉద్యోగులను సైతం లైన్ లోకి తీసుకొని మాట్లాడించినట్లు తెలిసింది…గతంలో అక్రమాలకు పాల్పడి నాసిరకం సరుకుల సరఫరాతో అందినకాడికి దండుకున్న కాంట్రాక్టర్లపై అనేక ఆరోపణలు వచ్చిన వారిని బ్లాక్ లిస్ట్ లో పెట్టకుండ టెండర్ ప్రక్రియనే అపహాస్యం చేస్తూ మళ్ళీ అదే కాంట్రాక్టర్ల కు ఎలా కాంట్రాక్ట్ కట్టబెడతారో ఆ ఆర్ సి ఓ మేడం కే తెలియాలి….ఒక్కో కాంట్రాక్టర్ ఎనిమిది సంవత్సరాలు గా ఒకే గురుకులంలో ఎలా కొనసాగుతారో ఇందులో మతలబు ఏంటో ఆ గుట్టు ఆర్ సి ఓ మేడమే విప్పుతే నిజాలు బయటకు వస్తాయి… గురుకులాల కాంట్రాక్టులు మళ్ళీ పాత వారికే కట్టబెట్టడం వల్ల ఎవరికి ఏ మేరకు లబ్ది జరుగుతుందో తెలియాలి…మార్కెట్ రేట్ కంటే ఎక్కువ ధర పెంచి సర్కార్ సొమ్ము ను కాంట్రాక్టార్లకు ఎలా దోచిపెడుతున్నారో సర్కార్ ఖజానాకు అధికారులే ఎలా గండి కొడుతున్నారో అర్థం అవుతుంది….
మడికొండ మళ్ళీ ఆ కాంట్రాక్టర్ కే….?
మడికొండ కాంట్రాక్ట్ మళ్ళీ ఆ కాంట్రాక్ట రే కట్టబెట్టినట్లు తెలిసింది…ఎనిమిది సంవత్సరాలు గా ఇదేచోట కాంట్రాక్టర్ గా కొనసాగుతు బాగానే వెనకేసిన ఇతగాడు కాంట్రాక్ట్ మళ్ళీ దక్కించుకున్నట్లు తెలిసింది….
మడికొండ, వరంగల్ మహిళా డిగ్రీ కళాశాల, బాలికల పాఠశాలలో గత ఎనిమిది సంవత్సరాలు గా ఈ టెండర్ దారుడు పనిచేస్తున్నాడు ..ఇప్పుడు కూడా గత పాత క్యాటరింగ్ కాంట్రాక్ట్ చేద్దామని మళ్లీ సిద్ధమైన ఇతగాడి కాంట్రాక్ట్ దాదాపు ఒకే చేసినట్లు సమాచారం…. పలు బినామీల పేర్లతో గురుకులాల్లో టెండర్ వేసిన ఈ కాంట్రాక్టర్ మడికొండ లో తన సొంత పేరుపై, బినామి పేరు పై నాలుగు గురుకుల డిగ్రీ ,పాఠశాలలో టెండర్ దక్కించుకున్నట్లు తెలిసింది…ఆ అధికారికి నమ్మినబంటులా ఉండే ఇతగాడి అందరికంటే ముందుగానే కాంట్రాక్ట్ ఒకే చేసినట్లు ప్రచారం జరుగుతోంది….
ఎవరు ఎక్కడ టెండర్ ఒకే చేసుకున్నారు….తెర వెనుక .ఎం నడిచింది….?
క్యాటరింగ్ లో వారే ఎందుకు పాతుకుపోయారు…మళ్ళీ మళ్ళీ వారికే ఎందుకు….?
పూర్తి వివరాలతో న్యూస్10 విశ్వసనీయ కథనం సాయంత్రం సంచికలో…..