కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ కిప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది…లైంగిక వేధింపుల ఘటనపై సీరియస్ అయ్యింది. పోలీస్ శాఖకు తలవంపులు తెచ్చిన ఎస్ఐను డిస్మిస్ చేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ ను సర్వీస్ నుంచి ప్రభుత్వం తొలగించినట్లు తెలిసింది.కాగా భవానీ సేన్ వేధింపులపై మహిళా కానిస్టేబుల్.. ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఆయన పాడు పనులు బయటపడ్డాయి. మహిళా కానిస్టేబుల్ ఎస్ఐ భవానీ సేన్ లైంగిక దాడికి పాల్పడ్డాడని. సర్వీస్ రివాల్వర్ తో బెదిరించి రెండు సార్లు లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు తెలిపినట్లు సమాచారం…
తప్పించుకునే యత్నం….
లైంగిక దాడి ఘటన నేపథ్యంలో భవాని సేన్ వ్యవహారం పై గత రాత్రి డి ఎస్ పి కాళేశ్వరం స్టేషన్ లో విచారణ జరిపి సర్వీస్ రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు…పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని భూపాలపల్లి తరలించారు…ఐయితే బుధవారం ఉదయం ఓ ప్రయివేటు వాహనం పిలిపించుకుని భవానీ సేన్ పారిపోయే ప్రయత్నం చేయగా భూపాలపల్లి ఎస్సై,డి ఎస్ పి రైటర్ గమనించి అడ్డుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది..