మంత్రి వద్దకు “పాపా”లరాయుడు

రాష్ట్ర రవాణశాఖలో తన పెత్తనాన్ని కొనసాగిస్తూ గత ప్రభుత్వ పెద్దలు తనకు బాగా దగ్గరి వారు అని ప్రచారం చేసుకొని తన ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అక్రమ ప్రమోషన్ల పాపాలరాయుడు ఇప్పుడు మరో కొత్త పల్లవి అందుకున్నట్లు తెలుస్తుంది…బి ఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంతా మనదే ఎంత చెపితే అంతా అన్న ఆ అక్రమ ప్రమోషన్ల డి టి సి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పార్టీ నాయకులకు ,మంత్రులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది…దగ్గరయ్యి గతంలో చేసిన పెత్తనం మళ్ళీ కొనసాగించేందుకు ఇప్పుడు పుష్పగుచ్చాల రాజకీయం నడుపుతున్నాడు… తనకు అత్యంత సన్నిహితులైన తనతోపాటు అక్రమంగా ప్రమోషన్ పొందిన మరో ఇద్దరు డి టి సి లను వెంటేసుకొని పుష్పగుచ్చం ఇచ్చి కొత్త రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఈ “పాపా”లరాయుడు కాక పెట్టె ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది….ఈ ప్రభుత్వంలోనూ హవా మనదే వసూళ్లన్నీ యధాతధం అన్నట్లు అధికారులకు సంకేతాలు ఇవ్వడం కోసం నానా తంటాలు పడుతున్నట్లు తెలిసింది….అంతేకాదు తన సామాజికవర్గానికి చెందిన ఓ యువ ఎమ్మెల్యే తనను కలవడానికి వస్తే పుష్పగుచ్ఛం తో స్వాగతం పలికి అంతమనదే అని బీరాలు పలికినట్లు తెలిసింది….మరోవైపు కొత్త ప్రభుత్వం ఏర్పడింది… తన సామాజికవర్గానికి చెందిన పెద్దల ప్రభుత్వం పోయిందని ఎవరు బెంగ పడొద్దని …ఈ ప్రభుత్వం మనదే ఎంత చెపితే అంతా అన్నట్లు నెల నెలా పంపే మామూళ్లు పంపడం ఆపొద్దని ఎం జరిగిన నేను ఉన్నానంటూ రవాణాశాఖలో ని తన కోటరీ ఉద్యోగులకు “పాపా”లరాయుడు ఇప్పటికే ఆదేశాలు జారిచేసినట్లూ విశ్వసనీయసమాచారం….కాగా రవాణాశాఖలో ఏ పనికైనా కొంతమంది ఉద్యోగులు, అధికారులు “పాపా”లరాయుడి ని సర్వరోగనివారిణిగా భావించే వారు ఇతగాడు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి పుష్పగుచ్ఛం అందించి ఆ ఫోటోలు వారికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లో పెట్టగానే తెగ సంబరపడిపోయారట…అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొంత “పాపా”లరాయుడి కి పంపించి మిగతాది ఎంచక్కా నొక్కేయచ్చని పాత తరహాలోనే దందా ను నిర్భయంగా నడపొచ్చని ధీమాగా ఉన్నారట…..రవాణాశాఖలో తన పెత్తనాన్ని కాపాడుకునేందుకు శతావిధాలా ప్రయత్నిస్తున్న “పాపా”లరాయుడి కి నూతన రవాణాశాఖ మంత్రి చెక్ పెడతారా….? లేక గత సర్కార్ లాగే చూసిచూడనట్లు వదిలేస్తారా….?అని రవాణాశాఖలో చర్చ సాగుతోంది…చూడాలి మరి మంత్రి పొన్నం ప్రభాకర్ “పాపా”లరాయుడి పట్ల ఎలా వ్యవహరిస్తారో….

అమాత్య ఓ కన్నెయండి….?

రేపటి సంచికలో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here