తూర్పు గులాబీలో కోవర్టులు…?

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బి ఆర్ ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ కు కోవర్టుల బాధ రోజురోజుకు పెరిగిపోతున్నట్లు తెలుస్తుంది…వరంగల్ ఎమ్మెల్యే గా మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న నన్నపునేని నరేందర్ కు సొంత పార్టీ లోనే కోవర్టులు ఉన్నారనే ప్రచారం బాగానే జరుగుతుంది…నన్నపునేని గెలుపును అడ్డుకోవడం కోసం గులాబీలో ని కొందరు అసంతృప్తి నేతలు పార్టీలో కొనసాగుతూనే పదవులు అనుభవిస్తూనే నరేందర్ వ్యతిరేక శిబిరంలో గుట్టుచప్పుడు కాకుండా చేరిపోయి గులాబీలో కోవర్టులుగా మారిపోయారని తెలుస్తుంది….ఎన్నికల ప్రచారం చేస్తున్న వారు అన్యమనస్కంగానే పాల్గొంటూ తెరవెనుక రాజకీయాలు చేస్తున్నారని తెలుస్తుంది…..ఓ పార్టీ అభ్యర్థి తో గతంలో ఉన్న పరిచయాల నేపథ్యంలో ఆ అభ్యర్థికి కోవర్టులు సహకారం అందిస్తున్నారని తెలుస్తుంది…ఇటీవల ఓ పార్టీలో మాజీ కార్పొరేటర్లు చేరడానికి,త్వరలోనే ఇంకొంతమంది గులాబీ సిట్టింగ్ కార్పొరేటర్లు ఆ పార్టీలో చేరడానికి వారు తెరవెనుక ఉండి ప్రోత్సహిస్తున్నారని విశ్వసనీయ సమాచారం…గులాబీలో  తూర్పు నుంచి టికెట్ ఆశించిన వీరు తమకు టికెట్ రాకపోవడం,సిట్టింగ్ లకె గులాబీ అధినేత టికెట్ ఇవ్వడంతో బహిరంగంగా ఎక్కడ కామెంట్ చేయకుండా టికెట్ వచ్చిన అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేస్తూ అతని ఓటమి కోసం బాగానే కష్టపడుతున్నట్లు తెలుస్తుంది…

గెలుపు అవకాశాలకు గండి….?

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉన్న గులాబీ కోవర్టులు నన్నపునేని నరేందర్ గెలుపు కు గండి కొడుతున్నారని  తెలుస్తుంది….గులాబీలోనే కొనసాగుతూ ప్రత్యర్థులకు సహకారం అందిస్తూ గులాబీ ఓట్లకు బాగానే గండి కొడుతున్నట్లు కనపడుతుంది…కొందరు గులాబీ నాయకులు పదవుల్లో కొనసాగుతూ నే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నారని తూర్పు గులాబీలో జోరుగా చర్చ సాగుతోంది…. కొంతమంది గులాబీ నాయకులైతే నన్నపునేని మరోసారి గెలవకూడదనే కోవర్టులు స్కెచ్ వేశారని ఆరోపిస్తున్నారు….తూర్పు నియోజకవర్గంలో  కోవర్టుల వ్యవహారం అధిష్టానం దృష్టి వరకు వెళ్లిన, చర్యలు తీసుకోవాలని కొందరు కోరిన ఎన్నికల వేళ  చర్యలు తీసుకోవడానికి అధిష్టానం వెనకడుగు వేస్తుందని తెలుస్తుంది…ఎన్నికలు ముగిసిన తర్వాత కోవర్టులపై చర్యలు తీసుకుంటారని కొందరు చెపుతుంటే  ఒకవేళ ఎన్నికల్లో నష్టం జరిగితే చర్యలు తీసుకున్న లాభం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here