మోగిన ఎన్నికల నగారా…

తెలంగాణ లో ఎన్నికల నగారా మోగింది….నవంబర్ 30 న తెలంగాణలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు…డిసెంబర్ 3 న ఎన్నికల కౌంటింగ్ ఉండనుంది…నవంబర్ 3 న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నారు…ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను భారత ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది… తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాలకు ఈ సి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది…తెలంగాణలో డిసెంబర్ న ఎన్నికలు నిర్వహించనున్నారు…నామినేషన్ల స్వీకరణ నవంబర్3 న ప్రారంభించి 10 వరకు స్వీకరిస్తారు…పరిశీలన 13 న,నామినేషన్ల ఉపసంహరణ నవంబర్15 న నిర్వహించనున్నారు …
తెలంగాణలో ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం మొత్తం ఓటర్లు 3 కోట్ల 17 లక్షల 17 వేల 389 మంది ఓటర్లు ఉన్నారు వీరిలో పురుషులు కోటి 58 లక్షల71 వేలు,మహిళలు కోటి 58 లక్షల మంది ,ట్రాన్సజెండర్లు 2 వేల 557,ఉన్నట్లు ఈ సి తెలిపింది….తెలంగాణలో 6 లక్షలకు పైగా ఓట్లు తొలగించినట్లు సి ఈ సి రాజీవ్ కుమార్ వెల్లడించారు…. తెలంగాణలో 17 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నట్లు ఈసీ పేర్కొంది….కాగా ఈ ఎన్నికల్లో వృద్ధులకు ఇంటినుంచే ఓటు వేసే అవకాశాన్ని ఈ సి కల్పించింది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here