తూర్పులో అవకాశం కోసం సీనియర్ల ఎదురుచూపులు
గులాబీలో అంతా ఆశవహులే..
నాయకుడికోసం.కాంగ్రెస్ ఎదురుచూపులు
అధిష్టానాలపై ఆశలు. నమ్ముకున్న వారిపైనే అంతా భారం
మేయర్ పదవిపై ఆశలు పెంచుకుంటున్న వద్దిరాజు
తూర్పు, పశ్చిమ ఆశవహుల్లో అసంతృప్తి…?
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అన్ని పార్టీల నాయకుల పరిస్థితి ప్రస్తుతం ఎవరి ధీమా వారిదిగా మారిందట. భవిష్యత్ పై ఆశలను పెంచుకుంటూ కొంతమంది తమ గాడ్ ఫాదర్ లను నమ్ముకొని ముందుకుపోతుండగా ఇంకొంతమంది తమ బలాన్ని, బలగాన్ని, ఆర్థిక బలాన్ని నమ్ముకొని ముందుకు పోతున్నారట. ప్రస్తుతం వరంగల్ తూర్పులో రెండు ప్రధాన పార్టీల పరిస్థితి ఇదేవిదంగా ఉందట. ఈ పోటీ పరిస్థితి గులాబీలో కాస్త అధికంగానే ఉండగా కాంగ్రెస్ పార్టీలో పోటీ ఉన్నట్లు కనిపించిన అంతగా ప్రభావితం చేసే నాయకులు ఎవరు లేరు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల వరకు కొండా దంపతులు తూర్పులో క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెడితే తూర్పు రాజకీయ ముఖచిత్రం కొద్దిగా మారే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ను టార్గెట్ గా పెట్టుకొని వ్యురచన చేసుకుంటున్న నాయకులు గ్రేటర్ ఎన్నికలు వేదికగా బలపడాలని చూస్తుండడంతో తూర్పులో రాజకీయాలు కొద్దీ రోజుల్లో మరింత రసకందాయంలో పడే అవకాశం ఉంది. మరో వైపు తన సోదరునికి వరంగల్ తూర్పులో లైన్ క్లియర్ చేసేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అధిష్టానం వద్ద చక్రం తిప్పగలిగి తన సోదరుడు ఎర్రబెల్లి ప్రదిప్ రావు వర్గానికి గులాబీ నుంచి గ్రేటర్ ఎన్నికల్లో కార్పొరేటర్ టిక్కెట్లు ఇప్పిస్తే ఇక్కడ పోటీ స్వపక్షియుల మద్యే పోటీ తీవ్రతరం ఐయ్యే అవకాశం ఉందనేది ఓ అభిప్రాయం.
ఒక్క చాన్స్….
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ అధిష్టానాన్ని నిత్యం వేడుకుంటున్న నాయకులు పెద్ద సంఖ్య లొనే ఉన్న వీరిలో మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, గుండు సుధారాణి, ఎర్రబెల్లి ప్రదీప్ రావు అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారిలో ముందున్నారు. వీరిలో సుధారాణి ఇప్పటికే నామినేటెడ్ పోస్టు దక్కించుకున్న, బస్వరాజు మాత్రమే పార్టీలో చేరిన దగ్గరి నుంచి ఏ పదవి దక్కక అసంతృప్తితో ఉన్న రానున్న గ్రేటర్ ఎన్నికల్లో తన పాత అనుచరులను, కార్యకర్తలను సమీకరించి కాస్త దూకుడు పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇదే గనుక జరిగితే గ్రేటర్ ఎన్నికల్లో నలుగురు హేమాహేమీలుగా భావిస్తున్న వారు డివిజన్లలో అభ్యర్థులతో కాస్త గందరగోళమే సృష్టించే అవకాశం ఉందట. ఈ ఎన్నికల్లోనే అవకాశాలను తీసుకొని తమ బలాన్ని నిరూపించుకునేందుకు ఒక్క ఛాన్స్ కోసం నేతలు ఎదురుచూస్తున్నారట. ఇలా గులాబీలో భవిష్యత్ ఆశావహుల సంఖ్య అధికంగానే ఉన్నట్లు స్పష్టం అవుతుండగా అధిష్టానం లో ఉన్న నాయకులపై నమ్మకం పెట్టుకున్న నాయకులు తమ భవిష్యత్ వారే చూసుకుంటారని ధీమా తో ఉన్నారట.
నాయకుడి కోసం…
వరంగల్ తూర్పు గులాబీలో ఆశావహులు ఎక్కువగా ఉంటే కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయట. తూర్పులో కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేక నాయకుడి కోసం కాంగ్రెస్ శ్రేణులు ఎదురుచూస్తున్నారట. వరంగల్ తూర్పులో కొండా దంపతులు అడుగు పెడితే కాంగ్రెస్ కాసింత ఖుషీగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. గతంలో గ్రేటర్ ఎన్నికల్లో కొండా ఆశీస్సులతో గెలిచిన వారు కొండ దంపతులు వస్తే తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందట. దింతో కాంగ్రెస్ తూర్పులో కాస్త ఊపందుకునే అవకాశం ఉన్నట్లు కనపడుతుంది. కాంగ్రెస్ కార్యకర్తల ఎదురుచూపులు ఫలించి కొండాదంపతులు తూర్పులో అడుగు పెడితే మార్పు రావడం సాధ్యంగానే కనపడుతుందని కొందరు భావిస్తున్నారు.
మేయర్ బరిలో వద్దిరాజు…?
ఇది ఇలా ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే గా పోటీచేసి ఓటమిపాలయి ఆ తర్వాత గులాబి తిర్టం పుచ్చుకున్న వద్దిరాజు రవిచంద్ర మేయర్ పదవిపై ఆశలు పెంచుకున్నట్లు తెలుస్తోంది. మేయర్ పదవి బిసి రిజర్వేషన్ కావడంతో గులాబీ అధిష్టానం నుంచి మేయర్ అభ్యర్థిగా వద్దిరాజుకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వద్దిరాజు అందుకు తగ్గట్టుగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఐయితే ఇదే పదవిపై వరంగల్ పచ్ఛిమ నుంచి సైతం కొంత పోటీ ఏర్పడగా వద్దిరాజు పేరు ఖాయంగా వినిపిస్తుండడంతో అక్కడి నాయకులు కొందరు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి వరంగల్ తూర్పులో ఆశవహుల మధ్య నెలకొన్న పోటీతో ఎవరి ధీమా వారిదిగా కనిపిస్తోంది.