ఎంత అమ్మిన తమకేం కాదని ధీమా
ఎక్సైజ్ అధికారులతో చెట్టా పట్టాల్…?
అధికారులు పట్టించుకోరు సిండికేట్ దందా ఆపదు
ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్న సిండికేట్ మద్యం వ్యాపారులు
కొందరు పోలీస్,ఎక్సైజ్ అధికారుల అండతో నిర్భయంగా మద్యం దందా
మీడియాతో సహా అందరిని చూసుకుంటున్నాం మాకేం కాదని పోజులు
నర్సంపేటలో జనాల జేబులు ఖాళీ చేసేందుకు అక్కడి మద్యం సిండికేట్ వ్యాపారులు పకడ్బందీ ప్రణాళిక తోనే ముందుకు కదులుతున్నట్లు తెలిసింది. ఎవరిని ఏరకంగా ప్రసన్నం చేసుకుంటే ముందుకు కదలవచ్చో తెలుసుకొని మరి ముంసుకు సాగుతున్నారట. మద్యం సిండికేట్ పై ప్రశ్నించిన ఎవరైనా వార్త రాసిన అధికారుల పరిచయాలతో అక్రమ కేసులు బనాయించి మానసికంగా వేదించేందుకు తాము సదా సిద్ధమని సంకేతాలు సైతం పంపుతున్నారట. నర్సంపేటలో ఓ మద్యం సిండికేట్ వ్యాపారి ఐయితే స్థానిక పోలీసు స్టేషన్ లోకి తన సొంత ఇంటిలోకి వెళ్లి వచ్చినట్లే వస్తు.. పోతు ఉంటాడట. అంతేకాదు పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులు తనకు చాలా దగ్గర అని చెప్పడానికి అప్పుడప్పుడు ఫోన్ లు చేస్తూ పలకరిస్తుంటాడట. అసలే తమది కోట్లల్లో వ్యాపారం ఎవరైనా అడ్డు వస్తే ఉరుకుంటామ…? అంటూ తన మేకపోతు గాంబిర్యాన్ని ప్రదర్శిస్తాడట. లాక్ డౌన్ సమయంలో నష్ట పోయాం అందుకే సిండికేట్ లా మారి ఇష్టం వచ్చిన రేటుకు మద్యం అమ్ముతాం…అది మా ఇష్టం అంటూ తన సన్నిహితుల వద్ద అంటున్నట్లు తెలిసింది. నర్సంపేటలో సిండికేట్ మరీ ఇంతలా రెచ్చిపోయి పేద ప్రజల, దినసరి కూలీల జేబులకు చిల్లులు పడేస్తున్నా అధికారులు మాత్రం అమ్ముకొని.. లాభం మనశాఖ కె కదా అన్నట్లు వ్యవహరిస్తున్నట్లు తెలిసింది.
మాకేం కాదు…!
రాసే వారు రాస్తారు… పిర్యాదు చేసేవారు చేస్తారు కానీ మేము మాత్రం మోనార్క్లం మారేది మాత్రం లేదని మద్యం సిండికేట్ వ్యాపారులు ధీమా వ్యక్తంచేస్తున్నారట. అడ్డగోలుగా, యథేచ్ఛగా ఎలాంటి భయం లేకుండా వైన్స్ లోని మద్యాన్ని వాహనాల ద్వారా బెల్ట్ షాపులకు తరలిస్తున్నారు. మద్యం సరఫరా చేయడానికి ప్రత్యేకంగా వాహనాలు కొని మరి మద్యాన్ని బెల్టు షాపులకు వారి ఇష్టం వచ్చిన ధరకు విక్రహిఇస్తూన్నారు దింతో బెల్టు షాపుల యజమానులు వారు ఇంకా అదనంగా రేటు పెంచి అమ్ముతూ మద్యం ప్రియుల నడ్డి విరగగొడుతున్నారు.
అధికారులు పట్టించుకోరు
మద్యం బెల్ట్ షాపుల వల్ల ప్రశాంత వాతావరణం దెబ్బతింటున్న, మద్యానికి బానిసై కాపురాలు కూలుతున్న, యువకులు మధ్యపాన ప్రియులుగా మారుతున్న ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం తమకేం పట్టనట్లు వ్యవహరిస్తూన్నారు. గుడుంబా విక్రహించే కడు పేదలైన గిరిజనులపై తమ ప్రతాపం చూపి నాన్ బెయిలబుల్ కేసులతో వారి జీవితాలను ఆగం చేసే వీరు కోట్లల్లో మద్యం వ్యాపారం చేసే వారు ఎన్ని అక్రమాలకు పాల్పడిన, బెల్టుల ద్వారా నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మిన,సిండికేట్ గా మారి మద్యం రేట్లు ఎమ్మార్పీ కన్నా రెట్టింపు ధరలకు అమ్మిన ఎక్సైజ్ అధికారులకు ఆ అక్రమ వ్యాపారం కనపడదు వినపడదు. నెత్తి నోరు కొట్టుకొని కొందరు పిర్యాదు చేసిన సిండికేట్ వారికి ఫోన్ చేసి పిర్యాదు చేసినవారి వివరాలు, ఫోన్ నంబర్, ఎలా అక్రమ కేసు బనాయించాలో కొందరు ఎక్సైజ్ వారే సలహాలు ఇస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. వీరి అక్రమ సిండికేట్ మద్యం వ్యాపారం నడవడానికి ఎక్కడినుంచి ఫిర్యాదులు వస్తాయో అవి రాకుండా ఆయా శాఖల్లో కొంతమంది ఇన్ఫార్మర్ల ను ఏర్పాటు చేసుకొని సిండికేట్ దందా నడుపుతున్నారని తెలుస్తోంది.దింతో అటు అధికారులు చర్యలు తీసుకోక, ఇటు పిర్యాదు చేసేవారు లేక ఈ సిండికేట్ దందా ఎలాంటి కనీస భయం లేకుండా నిరాటంకంగా కొనసాగితుందట.
ఎక్సైజ్ అధికారుల చెట్టాపట్టాల్…?
నర్సంపేటలో మద్యం సిండికేట్ నడుస్తోంది ఎక్సైజ్ అధికారులకు తెలుసు. ఎలా నడుస్తోంది ధరలు ఎలా ఉన్నాయి ఇవన్నీ తెలుసు అయిన వారు కిమ్మనరు. మద్యం వ్యాపారుల సిండికేట్ ను చూస్తూ గమ్మున కాలం గడుపుతారు. అవసరమైతే సిండికేట్ మద్యం వ్యాపారులకే ఫోన్ చేసి సలహాలు ఇస్తూ… క్షేమ సమాచారాలు కనుక్కుంటారట. సిండికేట్ నడుస్తుంది అని ఎవరు పిర్యాదు చేసిన పలానా వ్యక్తే కదా సిండికేట్ నడిపేది అని ఆడిగిమరి…సరే మేము చూసుకుంటాం అని చెప్తారట చర్యలు మాత్రం ఉండవట.పిర్యాదు చేస్తే ఏమైతది… ఎక్సైజ్ అధికారికి మరింత లాభం చేసినవారైతరు…. అంటూ మద్యం వ్యాపారులు కామెంట్ చేస్తూన్నారంటే వారు వీరిని ఏవిధంగా ప్రసన్నం చేసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు మద్యం అక్రమ దందాపై ఎవరు ప్రశ్నించిన పోలీసు,ఎక్సైజ్, మీడియా తో సహా అందరిని చుసుకుంటున్నాం మా దందాకు ఏంకాదు అని నర్సంపేట సిండికేట్ మద్యం వ్యాపారులు ధీమా వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. మరి ఇకనైనా అధికారులు కదులుతారా.. అక్రమంగా మద్యం అమ్మవచ్చు, బెల్ట్ షాపులు నడపవచ్చు, వారి ఇష్టం మేరకు మద్యం ధరలు పెంచవచ్చు అని ప్రకటించి అనుమతి ఇస్తారా వేచిచూడాలి.